Vijayawada: ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు

70 సంవత్సరాల చరిత్రలో ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటి సారిగా అమ్మవారు భక్తులకు చండీ దేవిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిథి, నక్షత్రాల ప్రకారం..అమ్మవారి అలంకారంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

New Update
Vijayawada: ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు

విజయవాడ ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు భక్తులకు శ్రీ మహాచండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారు జాము నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

ఈ సంవత్సరమే కొత్తగా అమ్మవారిని చండీ దేవి రూపంలో ఆలయాధికారులు అలంకరించారు. 70 సంవత్సరాల చరిత్రలో ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటి సారిగా అమ్మవారు భక్తులకు చండీ దేవిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిథి, నక్షత్రాల ప్రకారం..అమ్మవారి అలంకారంలో మార్పులు చోటు చేసుకుంటాయి.

చండీ అలంకారానికి ఎంతో ప్రసిద్ది ఉందని వేదపండితులు తెలుపుతున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది అంటున్నారు. చండీ అవతారంలో అనేకమంది దేవతలు కొలువై ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.

చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అని పండితులు తెలుపుతున్నారు. చండీ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య , కీర్తి సంపదలు అభించి శత్రువులు మిత్రులు అవుతారని..ఏ కోరికలు అయినా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని హీరోయిన్‌ మెహరీన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

దర్శనం చేసుకోవడానికి ఆలయాధికారులు చాలా సహకరించారని ఆమె వివరించారు. ప్రస్తుతం మెహరీన్‌ వి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఒక వెబ్‌ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలిపారు.

Also read: రేవంత్ రెడ్డికి షాక్.. ఈడీకి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేత

Advertisment
Advertisment
తాజా కథనాలు