BREAKING: జగన్‌కు కోర్టు షాక్.. లండన్ పర్యటనకు బ్రేక్!

AP: ఈరోజు లండన్‌కు వెళ్లాల్సిన జగన్ పర్యటన వాయిదా పడింది. ఆయన డిప్లమాట్ పాస్‌పోర్ట్ రద్దు కావడంతో సాధారణ పాస్‌పోర్ట్ అప్లై చేసుకున్నారు. కాగా తనను విదేశాలకు వెళ్లేందుకు 5 సంవత్సరాలు అనుమతించాలని విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

BREAKING: జగన్‌కు కోర్టు షాక్.. లండన్ పర్యటనకు బ్రేక్!
New Update

YCP Chief Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్ వేసింది. లండన్ ప్రయాణాన్ని జగన్ వాయిదా వేసుకున్నారు. సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్‌పోర్ట్ రద్దు అయింది. ఈ క్రమంలో జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు జగన్. ఐదు సంవత్సరాలు పాటు పాస్‌పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జగన్ లాయర్లు. ఒక ఏడాది పాటు పాస్‌పోర్ట్ ఇవ్వాలని విజయవాడ కోర్ట్ ఆదేశం ఇచ్చింది. జగన్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

గతంలో కోర్టు అనుమతితో విదేశాలకు..

గతంలో అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ తో పాటు విజయసాయిరెడ్డికీ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసే సందర్భంలో సీబీఐ కోర్టు పలు షరతులు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో ముందస్తు అనుమతితోనే విదేశీ పర్యటనలు చేయాలనే షరతు కూడా ఒకటి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన జగన్.. తన కూతురు చదువుకుంటున్న లండన్ దేశానికి వెళ్లేందుకు సీబీఐ కోర్టును అనుమతి కోరారు.

కోర్టు అనుమతి ఇవ్వడంతో లండన్ కు వెళ్లారు జగన్. తాజాగా మరోసారి లండన్ కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయవాడ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. మరి కోర్టు పర్మిషన్ ఇస్తుందా? లేదా?అనేది వేచి చూడాలి. వాస్తవానికి ఈరోజు జగన్ లండన్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. కోర్టు వారు వేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేయడంతో జగన్ లండన్ పర్యటన కూడా వాయిదా పడింది.

#jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe