ఆ పాపం అధికారులదే.. నా మాట వినలేదు.. బస్ ప్రమాదంలో డ్రైవర్ సంచలన నిజాలు

విజయవాడ బస్సు ప్రమాదానికి తనకి సంబంధం లేదని డ్రైవర్‌ అంటున్నాడు. నడపడం రాదని చెబుతున్న అధికారులు వినిపించుకోలేదని ఆయన వివరించారు.

New Update
ఆ పాపం అధికారులదే.. నా మాట వినలేదు.. బస్ ప్రమాదంలో డ్రైవర్ సంచలన నిజాలు

సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌ లో జరిగిన ప్రమాదంలో మరో ట్విస్ట్‌ బయటకు వచ్చింది. ఆటోమేటిక్‌ గేర్‌ ఉన్న బస్సు తాను నడపలేనని అధికారుల ముందు వెల్లడించిన బస్సు డ్రైవర్‌ ప్రసాద్‌. కానీ డ్రైవర్‌ ప్రసాద్‌ మాటను అధికారులు పట్టించుకోకుండా..నడపాల్సిందే అని చెప్పారు.

ఆ కారణంగానే బస్సు గేర్‌ వేసే సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన డ్రైవర్‌ ప్రసాద్‌. డ్రైవర్‌ మరో ఆరు నెలల్లో రిటైర్‌ అవ్వబోతున్నారు. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది.

విజయవాడ ఆర్టీస్‌ బస్టాండ్‌ లో ప్లాట్‌ ఫాం 12 వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరి కొంత మంది గాయపడ్డారు. ఈ ఘటన గురించి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. ఈ ప్రమాదాన్ని సీరియస్‌ గా తీసుకున్నట్లు వివరించారు. 

బస్సు ప్రమాదానికి ముఖ్య కారణం సాంకేతిక లోపమా? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్టీసీ తరుఫున రూ. 5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించినట్లు ఆయన తెలిపారు.

అలాగే ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వారికి చికిత్స కు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఆర్టీసేనే భరిస్తుందని ఆయన వివరించారు. బ్రేక్‌ ఫెయిల్‌ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారని చెప్పుకొచ్చారు. రివర్స్‌ గేర్‌ వేయడంతో అది ఫెయిల్‌ అయ్యిందని దాని వల్లే బస్సు ముందుకు రావడంతో ప్రమాదం జరిగిందని వివరించారు.

ఈ ఘటన గురించి విచారణ జరిపించి 24 గంటల్లో నిందితుల పై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రు బస్టాండ్‌ లో బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌ తో పాటు మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం ప్లాట్‌ ఫాం నంబర్‌ 12 వద్ద జరిగింది.

ఏపీ సర్వీసు మెట్రో లగ్జరీ బస్సు విజయ వాడ నుంచి గుంటూరు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ప్లాట్‌ ఫాం పైకి దూసుకెళ్లింది. డ్రైవర్‌ రివర్స్‌ గేర్‌ బదులు ఫస్ట్‌ గేర్‌ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు డిపో రిజనల్‌ మేనేజర్‌ చెబుతున్నారు.

ఈ ప్రమాదంలో కండక్టర్, మహిళా ప్రయాణికురాలు, రెండున్నరేళ్ల బాబు.. ముగ్గురు మృతి చెందారు. బస్సు ప్రయాణికుల మీదికి దూసుకువచ్చింది. మృతి చెందిన వారిని కుమారి (ప్రయాణికురాలు), , అవుట్‌ సోర్సింగ్‌ బుకింగ్‌ కండకట్ర్‌ వీరయ్య ఘటనా స్థలంలోనే చనిపోయారు. అయాన్ష్‌ (2. 5 సంవత్సరాలు) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సుకన్య అనే ప్రయాణీకురాలు , అవుట్ సోర్సింగ్ బుకింగ్ కండక్టర్ గాయపడ్డారు.

డ్రైవర్ కు 61 సంవత్సరాలు..దానికి తగినట్లు ఆయన కొంత అనారోగ్యంతో ఉన్నట్లు ఆయన వివరించారు.ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదని ఆర్టీసీ ఎండీ వివరించారు.

Also read: బస్సు డ్రైవర్ కు అనారోగ్యం.. విజయవాడ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ సంచలన ప్రకటన!

Advertisment
తాజా కథనాలు