రాజాసింగ్ సస్పెన్షన్‌పై విజయశాంతి కామెంట్స్ తెలంగాణలో కమలం పార్టీలో ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్థానిక నేతల మధ్య విభేదాల కారణంగా అధిష్టానం బీజేపీ నేతలతో భేటీ అయింది. ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచనల వ్యాఖ్యలు చేశారు. By Vijaya Nimma 30 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి అంతా మంచే జరుగుతుంది తాజాగా విజయశాంతి.. తన ట్విట్టర్ అకౌంట్‌లో రాజాసింగ్ సస్పెన్షన్‌పై సంచలన పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని ఆమె తెలిపారు. అయితే, బండి సంజయ్‌తో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నామని విజయశాంతి వెల్లడించింది. అలాగే జరుగుతుందని నమ్ముతున్నాం.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు, కార్యకర్తలు ఉన్న బీజేపీ తన కార్యకర్తలకు న్యాయం చేసుకోకుంటే ఇంత శక్తి వస్తదా.. సరైన సమయంలో అంతా మంచే జరుగుతుందని విజయశాంతి ట్విట్టర్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. మంచి నిర్ణయం వస్తుంది కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా ఆదరించే బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి వ్యవహరిస్తుందని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఆలస్యమైనట్లు కనిపించినా అంతిమ నిర్ణయం కచ్చితంగా అందరికీ మంచిగానే వస్తుందని అప్పటి వరకు అందరు వేచి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇక, విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక విజయశాంతి ట్విట్‌పై బీజేపీ కార్యకర్తలు రాజాసింగ్ సస్పెన్షన్‌పై స్పందిస్తున్నారు. కొంత ఆలస్యం ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నరు. అయితే, బండి సంజయ్‌తో సహా రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నము. అలాగే జరుగుతుందని నమ్ముతున్నం అని అన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి