Vijayakanth Death: సంపన్న కుటుంబంలో పుట్టీ.. చిన్నప్పటి నుంచీ ఆడుతూ పాడుతూ పెరిగిన విజయ్ కాంత్ కి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. అందులోనూ ఎంజీఆర్ సినిమాలంటే పడి చచ్చిపోయేవారు. ఎంతలా అంటే ఆయన సినిమాలను ఒకటికి పదిసార్లు చూసేవారు. ఎంజీఆర్ నటించిన నటించిన అమ దిట్టుప్ పిల్లై చిత్రాన్ని దాదాపు 70 సార్లు చూశారు. సినిమాలనే కాదు.. ప్రజానాయకుడిగా ఎదగడంలోనూ విజయ్ కాంత్ కు స్ఫూర్తి ఎంజీఆర్. సినిమాల్లో నటించాలని చెన్నై వచ్చారు. స్టూడియోల చుట్టూ తిరిగారు. కష్టాలు పడ్డారు.. నల్లోడివి నీకు సినిమాలేంటి? అని ఎందరు ఎద్దేవా చేసినా భరించారు. సినిమా హీరో కావాలనే కల కోసం పరితపించారు. సినిమాల్లోకి వచ్చాకా కూడా జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. మొదట్లో వరుస ఫ్లాప్ లు.. తరువాత విజయాలు.. మళ్ళీ వరుస ఫ్లాప్ లు అయినా ఆయనకు అభిమానుల అండదండలు విపరీతంగా ఉన్నాయి. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం.
ఆసుపత్రి కట్టాలన్నా.. ఎక్కడైనా సమస్య పరిష్కరించాలన్నా.. విజయ్ కాంత్(Vijayakanth Death) ఒక్క పిలుపు నిస్తే ఆయన అభిమానులు అక్కడికి వేలాదిగా వాలిపోయేవారు. ఆయన చెప్పిన పని చేసి చూపించేవారు. ఉద్ధండులు సినిమాల్లో ఉన్న సమయంలో వారి మధ్య నెగ్గుకు వచ్చారు. అదే ఉద్ధండులు రాజకీయాల్లో ఉన్న సమయంలో వారితో సై అంటూ పోటీ పడ్డారు. తమిళనాట నటుడిగా.. రాజకీయ నాయకుడిగా.. ఆయన స్టైల్ వేరు. ఆయన మరణం తమిళనాడుతో పాటు దక్షిణ భారతావనిని విషాదంలో ముంచేసింది. ఎందుకంటే, ఆయనకు మిగిలిన భాషల్లోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగులో కూడా విజయ్ కాంత్ కు మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది.
Also Read: తుపానుల మధ్య పిడుగు.. విజయకాంత్ అంటే అంతే మరి!
ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ కాంత్(Vijayakanth Death) సినిమా హీరోల్లో ఎంజీఆర్ తరువాత.. ఇప్పటి తరంలో ఎవరంటే ఇష్టమో తెలుసా? ఆయన తన ఇష్టాఇష్టాలను ఆ మధ్య మీడియాతో పంచుకున్నారు. ఆయన తెలుగులో బాగా ఇష్టపడే నటుడు మరెవ్వరో కాదు.. మన యంగ్ రెబల్ స్టార్.. సలార్ ప్రభాస్. అవును.. విజయ్ కాంత్ కి ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఆయన ఆ మాట చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయన ఇష్టపడేది మన అరుంధతి అనుష్క. విజయకాంత్ కు ప్రభాస్ - అనుష్క అంటే అభిమానం అని వింటేనే సరదాగా ఉంది కదూ. ఇక రంగుల్లో నలుపు రంగు బాగా ఇష్టమట.. అలాగే ట్రావెలింగ్ అన్నా.. పుస్తకాలు చదవడం అన్నా.. డాన్స్ అన్నా చాలా ఇష్టం అని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఇప్పుడు విజయ్ కాంత్ మన మధ్య లేరు. కానీ, ఆయన ఇష్టా ఇష్టాలు ఏమిటి అనే దానిపై నెట్టింట సెర్చ్ జోరుగా సాగుతోంది. అవును.. ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నవారు భౌతికంగా ఉన్నా.. లేకపోయినా వారి విషయాలు ఎప్పుడూ ప్రజల మదిలో నిలిచే ఉంటాయి. అన్నట్టు.. సహాయం చేయడం విషయంలో విజయ్ కాంత్(Vijayakanth Death) గురించి తమిళనాడులో ఏమంటారో తెలుసా? ఆయన సహాయం పొందిన వారు ఎంత మంది అనే లెక్క చెప్పలేం కానీ, తమిళనాట ప్రతి గ్రామంలోనూ ఆయన సహాయం పొందిన కుటుంబం ఒకటి కచ్చితంగా ఉంటుంది.. అని చెబుతారు.
Watch this interesting Video: