లేడీ అమితాబ్.. విజయశాంతి బర్త్ డే స్పెషల్

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బర్త్ డే ఇవాళ. ఈమె మొత్తం 175 సినిమాల్లో నటించారు. తెలుగులో 121, తమిళంలో 39, హిందీలో 6, కన్నడలో 5, మలయాళంలో 4 సినిమాలు చేశారు. తన 13వ ఏటనే కెరీర్‌ ని ప్రారంభించారు. మొదటి చిత్రం 'కల్లుక్కుల్ ఏరం'(తమిళం, 1979). భారతీ రాజా దర్శకత్వం వహించారు. తెలుగులో హీరోయిన్ గా ఖిలాడీ కృష్ణుడుతో ఆరంగేట్రం చేశారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు విజయశాంతి.

New Update
లేడీ అమితాబ్.. విజయశాంతి బర్త్ డే స్పెషల్

young-and-beautiful-vijayashanti 4

లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్.. ఇలా విజయశాంతికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కమర్షియల్‌ సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు చేశారు. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ లో సీరియస్ పాత్రలను అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఈమెది సపరేట్ ట్రాక్. టాప్ హీరోలతో ఆడిపాడిన విజయశాంతి.. రెమ్యూనరేషన్ విషయంలోనూ అదే స్థాయిలో అందుకున్నారు. అత్యధిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి రికార్డులు సృష్టించారు.

young-and-beautiful-vijayashanti 3

విజయశాంతి 1964 జూన్ 24న జన్మించారు. ఈమె అసలు పేరు శాంతి. పిన్ని విజయలలిత తెలుగు సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. ఆమె పేరులోని విజయను చేర్చుకుని విజయశాంతిగా కెరీర్ ను ప్రారంభించారు. 15వ ఏటనే తమిళ చిత్రసీమలో అడుగు పెట్టారు విజయశాంతి. సినీ ఇండస్ట్రీలో ఈమెది 40 ఏళ్ల ప్రస్థానం. 1979లో తమిళంలో కల్లుక్కుళ్ ఈరమ్ తో ఆరంగేట్రం చేశారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడీ కృష్టుడులో హీరోయిన్‌ గా చేశారు. కానీ, నటిగా బ్రేక్ ఇచ్చిన మూవీ నేటి భారతం. అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు పట్టారు. కర్తవ్యం చిత్రంలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ ను అందుకున్నారు.

publive-image

వందేమాతరం, ప్రతిఘటన, అగ్నిపర్వతం, పసివాడి ప్రాణం, స్వయం కృషి, యముడికి మొగుడు, జానకి రాముడు, ముద్దుల మామయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు, గ్యాంగ్ లీడర్, చినరాయుడు, మొండిమొగుడు పెంకి పెళ్లాం సినిమాలు విజయశాంతిని స్టార్ హీరోయిన్ ని చేశాయి. సౌత్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగారు. జాతీయ అవార్డులతో పాటు ఏడుసార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ నటిగా నాలుగు నంది అవార్డులు గెలుచుకున్నారు.

young-and-beautiful-vijayashanti 6

టాలీవుడ్‌ లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిది హిట్ కాంబినేషన్ . వీరిద్దరూ కలిసి 19 చిత్రాల్లో నటించారు. అలాగే, బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌ లో 17 సినిమాలు వచ్చాయి. కర్తవ్యం సినిమాను హిందీలో తేజస్విని పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ బిరుదు పొందిన ఏకైక భారతీయ నటి ఈమే. ఒసేయ్ రాములమ్మ సినిమాతో రాములమ్మ గా ఎనలేని గుర్తింపు పొందారు.

young-and-beautiful-vijayashanti

సినిమాల్లో అనేక ఎత్తుపల్లాలు చూశాక.. రాజకీయాల వైపు అడుగులు వేశారు విజయశాంతి. 1998లో బీజేపీలో చేరారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. దాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసి ఎంపీ అయ్యారు. అనంతరం ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా సెట్ కాక.. మళ్లీ తన మాతృ పార్టీ బీజేపి గూటికి చేరారు. అయితే.. చాలా కాలం తర్వాత 202లో మహేష్ బాబు హీరోగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు మూవీతో నటిగా విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. దేనికీ సైన్ చేయలేదు. రాజకీయాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు.

young-and-beautiful-vijayashanti 5

young-and-beautiful-vijayashanti 1

Advertisment
Advertisment
తాజా కథనాలు