Captain Vijayakanth : సీనియర్ నటుడు డీఎండీకే(DMDK) అధినేత కెప్టెన్ విజయ్ కాంత్(Vijayakanth) అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్యే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విజయ్ కాంత్…కోవిడ్(Covid-19) బారిన పడ్డారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. విజయ్ కాంత్ 80,90 దశకాల్లో వందలాది సినిమాల్లో నటించారు. విజయ్ కాంత్ తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించిన విజయ్ కాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయ్ కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది.
పూర్తిగా చదవండి..Vijayakanth : విజయ్ కాంత్ మన తెలుగోడే…ఆంధ్ర నుంచి వలస వెళ్లిన విజయ్ కాంత్ కుటుంబం..!!
ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కోవిడ్ బారిన పడి తుది శ్వాస విడిచారు. విజయ్ కాంత్ ది తెలుగోడి రక్తమే. వందల ఏళ్ల క్రితం ఆయన కుటుంబం ఏపీ నుంచి తమిళనాడుకు వలస వెళ్లిందని ఆయనే స్వయంగా ఓ సందర్బంలో వివరించారు.
Translate this News: