Vijay Devarakonda : కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ?

'VD14' మూవీలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో ఏకంగా యుద్ధ వీరుడిగా కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది.

Vijay Devarakonda : కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ?
New Update

Vijay Devarakonda In Dual Role : రీసెంట్ గా 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో థియేటర్స్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అతని పుట్టిన రోజున ఆ సినిమాల అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లో 'VD14' కూడా ఒకటి. 'టాక్సీ వాలా' మూవీ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

'ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి' అంటూ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. బీటలు వారిన నేలపై గుర్రపు స్వారీ చేస్తున్న ఓ లెజెండ్‌ కథను సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు ఆ పోస్టర్ లో ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ రిస్క్ చేయనున్నట్లు తాజా సమాచారం బయటికి వచ్చింది.

Also Read : సినీ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం!

ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో

'VD14' మూవీలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో ఏకంగా యుద్ధ వీరుడిగా కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ లో నటించింది లేదు.

అదికూడా యుద్ధ వీరుడి పాత్ర చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకొని చాలాకాలం అవుతోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోతున్నాయి. ఇలాంటి టైం లో విజయ్ దేవరకొండ పీరియాడిక్ స్టోరీ ఎంచుకొని ఆ సినిమాలో డ్యూయల్ రోల్ చేయడం ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి. మరి రౌడీ హీరోకి డ్యూయల్ రోల్ కలిసొస్తుందేమో చూడాలి.

#vd14-movie #vijay-devarakonda
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe