Vijay Antony : చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం అదేనట!

తమిళ హీరో విజయ్ ఆంథోనీ మాత్రం ఏకంగా కొన్ని నెలల నుంచి చెప్పులు వేసుకోవడమే మానేశాడట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Vijay Antony : చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం అదేనట!
New Update

Vijay Antony Stopped Using Slippers : సినిమా సెలెబ్రిటీలు చెప్పులు వేసుకోకుండా బయటికి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోలు ఏదైనా దీక్షలో ఉంటే తప్ప చెప్పులు వేసుకోరు. కానీ తమిళ హీరో విజయ్ ఆంటోని మాత్రం ఏకంగా కొన్ని నెలల నుంచి చెప్పులు వేసుకోవడమే మానేశాడట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టాడు.

జీవితాంతం చెప్పులు లేకుండానే...

విజయ్ ఆంటోని హీరోగా తుపాన్ (Toofan Movie) అనే సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో విజయ్ ఆంటోని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే స్టేజ్ పై చెప్పులు లేకుండా కనిపించడంతో ఏదైనా దీక్షలో ఉన్నారా? అని మీడియా వాళ్ళు ప్రశ్నించారు.

Also Read : పోలీసులకు దొరికిపోయిన నివేదా.. ఏంటని అడిగినందుకు గొడవ..!

దీనికి విజయ్ ఆంటోని బదులిస్తూ.." నేను ఎలాంటి దీక్షలో లేను. దాదాపు మూడు నెలల నుంచి చెప్పులు లేకుండా తిరిగుతున్నాను. దీనికంటూ ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఒకరోజు నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు చాలా బాగా అనిపించింది.

ప్రశాంతంగా కూడా ఉంటుంది. హెల్త్ కి కూడా మంచిది. అంతేకాదు మనలోని కాన్ఫిడెన్స్ ను పెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం స్టార్ట్ చేసానో అప్పట్నుంచి ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. అందుకే జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను" అంటూ తెలిపాడు.

#vijay-antony #toofan-teaser-launch
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe