TTD : టీటీడీ నుంచే ప్రక్షాళన : సీఎం చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పై దృష్టి పెట్టింది. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. చెప్పినట్టుగానే... టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు పడ్డాయి.

New Update
TTD : టీటీడీ నుంచే ప్రక్షాళన : సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఏపీ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం  (TTD) పై దృష్టి పెట్టింది. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. చెప్పినట్టుగానే... టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు పడ్డాయి. టీటీడీలో విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ఈ విచారణ ముందుకు కదులుతుంది.

టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనంలో విజిలెన్స్ అధికారులు (Vigilance Officers) సోదాలు నిర్వహించారు. టీటీడీకి చెందిన వివిధ విభాగాల్లో 40 మంది అధికారులతో ఈ సోదాలు నిర్వహించారు. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన పరిణామాలు, కార్యకలాపాలు, లావాదేవీలపై విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు.

విచారణలో భాగంగా విజిలెన్స్ అధికారులు తిరుపతిలో స్థానికుల నుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. బీజేపీ (BJP) నేత నవీన్ పలు వివరాలను, తన వద్ద ఉన్న ఆధారాలను విజిలెన్స్ అధికారులకు అందజేశారు.

Also read: విజయవాడలో పెట్రోల్‌ కు బదులు నీళ్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు