వేసవిలో విహారయాత్రలకు పోదాం పదండి!

ఎండాకాలంలో సెలవులు వచ్చాయంటే వెంటనే గుర్తొచ్చేది విహారం. ఈ ఖాళీ సమయంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలా సరదాగా ట్రిప్‌ ప్లాన్ చేస్తుంటారు. అయితే మండు వేసవిలో ప్రకృతి ఒడిలో సేద తీరాలనిపిస్తే ఏంచక్కా కేరళకు వెళ్లి రండి.

వేసవిలో విహారయాత్రలకు పోదాం పదండి!
New Update

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందిస్తున్న కేరళ టూరిజం ప్యాకేజీ పరిశీలించండి. అందమైన ప్రకృతి సోయగాలకు నెలవు కేరళ. ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉంటాయి. వీటిని తక్కువ ఖర్చులోనే వీక్షించే సదుపాయం అందిస్తోంది ఐఆర్‌సీటీసీ.కేరళ హిల్స్ అండ్ వాటర్ పేరిట IRCTC ఈ ప్యాకేజీ అందిస్తోంది. గుంటూర్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి రైల్వే స్టేషన్లలో టూరిస్ట్స్ ఈ ట్రైన్ ఎక్కొచ్చు. కేరళ ప్రయాణం ముగిశాక.. మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంటుంది. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉంటుంది. ఇప్పుడు ఏప్రిల్ 9, 16, 23, 30, మే 14, 21, 28 తేదీలకు గానూ (ప్రతి మంగళవారం) టూర్ వెళ్లాలనుకునే వారికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 17230) బయలుదేరుతుంది. రెండో రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకుళం రైల్వే సేషన్‌కు చేరుతారు. అక్కడ్నుంచి ఐఆర్సీటీసీ సిబ్బంది మన్నార్‌కు తీసుకెళ్తారు. ముందుగా బుక్ చేసిన హోటల్‌లో రాత్రి బస ఉంటుంది.మూడో రోజు ఎరవికుళం నేషనల్ పార్కు, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యాం వీక్షించడంతో ఆరోజు పర్యటన ముగుస్తుంది. రాత్రి మన్నార్‌లోనే ఉండాలి.4వ రోజు పొద్దున అలెప్పీ చేరుకుంటారు. అలెప్పీ చుట్టుపక్కల ఉన్న అందాల్ని వీక్షిస్తారు. రాత్రి అక్కడే హోటల్లో బస ఉంటుంది.ఐదో రోజు అలెప్పీ నుంచి ఎర్నాకుళం స్టేషన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 11.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెం. 17229) బయల్దేరుతుంది.ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.

కంఫర్ట్‌లో (3RD AC) అయితే ఒక్కో ప్రయాణికుడికి రూం సింగిల్ షేరింగ్ అయితే రూ. 35,570, ట్విన్ షేరింగ్ అయితే రూ. 20,430 అవుతుంద. ఇదే ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్), రూం సింగిల్ షేరింగ్ అయితే రూ. 32,860, ట్విన్ షేరింగ్ కోసం రూ. 17,720, ట్రిపుల్ షేరింగ్ కోసం రూ. 13,860 కట్టాలి. ఇక్కడ విత్ బెడ్‌తో చిన్నారులకు రూ. 6130, వితౌట్ బెడ్ అయితే రూ. 3870 చెల్లించాలి. ఎక్కువ మంది కలిసి బుక్ చేసుకుంటే ఛార్జీలు తగ్గుతాయి. మీరు ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైలులో 3RD AC, స్లీపర్ క్లాస్ జర్నీ ఉంటుంది. ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం ఏర్పాటు చేస్తారు. కేరళలో 3 రాత్రులు ఉండేందుకు గదులు, ఉదయం అల్పాహారం ఫ్రీగా లభిస్తుంది. పార్కింగ్ ఛార్జీలు, టోల్ వంటివి ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి. ఇంకా ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు యాత్రికులే చూసుకోవాల్సి ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు వంటివి పర్యటకులే చెల్లించాలి. హార్స్ రైడింగ్, బోటింగ్ వంటి వాటి కోసం వారే చెల్లించాలి. గైడ్‌ను కూడా యాత్రికులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూర్‌కు సంబంధించి ఇతర వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సందర్శించండి.

#tour #kerala-hills #irctc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe