Vidya Lakshmi: విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..భారీగా ఆర్థిక సాయం.. అప్లయ్ చేసుకోండిలా.!

కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో వారికి ఆర్థిక సాయం అందించే విషయంలోనూ ప్రయత్నిస్తోంది. విద్యలక్ష్మీపథకం పేరుతో పోర్టుల్ ప్రారంభింది. ఈ స్కీం గురించి తెలుసుకోవాలంటే ఈ కథనంలోని వెళ్లండి.

New Update
Vidya Lakshmi: విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..భారీగా ఆర్థిక సాయం.. అప్లయ్ చేసుకోండిలా.!

Vidya Lakshmi Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ విద్యార్థులకు ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆర్థిక సాయం అందించే విషయంలోనూ బాసటగా నిలుస్తోంది. దీనిలో భాగంగానే విద్య లక్ష్మీ పథకం స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు చదువుకోవచ్చు. వారికి కేంద్రం ఆర్థికంగా సాయం అందిస్తుంది. ఇది సెంట్రల్ ఐటీ ఆధారిత ఎడ్యుకేషన్ లోన్ (Education Loan) . ఈ లోన్ పొందేందుకు విద్యలక్ష్మీ పోర్ట్ (https://www.vidyalakshmi.co.in/Students/index)ను తెరిచింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రకరకాల బ్యాంకులకు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా పూర్తి సమాచారం ఇదే పోర్టల్ నుంచి పొందవచ్చు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు.

విద్యార్థులు పొందే లోన్ పై వడ్డీ తక్కువగా ఉంటుంది. ఎంత రుణం కావాలంటే అంత తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ బ్యాంకుకైనా ఒకటే దరఖాస్తు ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు లోన్ కూడా తొందరగా లభిస్తుంది. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్థులు ఆయా బ్యాంకులకు ఈమెయిల్స్ పంపి లోన్ వివరాలను తెలుసుకోవచ్చు. ఏవైనా అనుమానాలు ఉంటే క్లారిటీ కూడా తీసుకోవచ్చు.

లోన్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ముందుగా https://www.vidyalakshmi.co.in/Students/index లోకి వెళ్లాలి. అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం మీరు బ్యాంకుకు వెళ్లి రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో నుంచి ఆన్ లైన్లో రిజిస్టర్ అవ్వవచ్చు. పోర్టల్ హోం పేజీలో రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. మీరు పేరు, వయసు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత కింద ఉండే website agreement terms & conditions క్లిక్ చేసి..వాటిని చదివి, సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడీకి కన్ఫర్మేషన్ లింక్ ఒకటి వస్తుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

లోన్ ఎలా పొందాలి?
విద్యాలక్ష్మీ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ మెనూలో Search for Loan Scheme పై క్లిక్ చేయాలి. మీ స్టడీలోన్ కెటగిరీని కూడా సెలక్ట్ చేసుకోవాలి. మీ కోర్సుకు ఎంత లోన్ కావాలో అక్కడ తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేసి...లోన్ ఇచ్చే బ్యాంకుల జాబితాను తెలుసుకోవచ్చు. మీకు దగ్గరలోని బ్యాంకు బ్రాంచ్ ను మీరు సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు లోన్ ఎంత ఇస్తారు..ఎంత వడ్డీ ఉంటుంది, ఎప్పటిలోగా చెల్లించాలో తెలుసుకోవాలి. ఆ లోన్ కు దరఖాస్తు చేసుకోవాలి. రుణం కోస దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత బ్యాంకు మీ వివరాలన్నింటిని తీసుకుంటుంది. తర్వాత మీకు లోన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తుంది. మీరు తరచూ బ్యాంకు సిబ్బంది అడుగుతుంటే త్వరగా లోనే వచ్చేలా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో గెలిస్తే.. రాజ్యాంగం నాశనమవుతుంది : రాహుల్ గాంధీ

Advertisment
తాజా కథనాలు