Vidya Balan: ఇండస్ట్రీ ఎవడి సొత్తు కాదు.. అందుకే నేనంటే హీరోలకు నచ్చదు!

సినీ ఇండస్ట్రీలో తాను చాలామంది హీరోలకు నచ్చనని విద్యా బాలన్ చెప్పింది. 'నేను లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తాను. అది కొందరు హీరోలకు నచ్చదు. అందుకే వారు నాతో సినిమాలు చేసేందుకు ఒప్పుకోరు. నన్ను ఐరెన్ లెగ్ అంటారు' అంటూ ఎమోషనల్ అయింది.

New Update
Vidya Balan: ఇండస్ట్రీ ఎవడి సొత్తు కాదు.. అందుకే నేనంటే హీరోలకు నచ్చదు!

Vidya Balan: బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన పలు చేదు అనుభవాల గురించి ఓపెన్ అయింది. ఈ మేరకు ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్యార్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి.. తానంటే చాలామంది హీరోలకు నచ్చనంటూ పలు ఆసక్తికర విషయాల పంచుకుంది.

ఐరెన్ లెగ్ అంటారు..
ఈ మేరకు విద్యా బాలన్ మాట్లాడుతూ.. ‘నేను లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ చేస్తాను. ఈ సినిమాల్లో మంచి సందేశంతోపాటు ప్రేక్షకులు ఆదరిస్తారు. అది కొందరు హీరోలకు నచ్చదు. అందుకే వారు నాతో సినిమాలు చేసేందుకు ఒప్పుకోరు. కొంతమంది నిర్మాతలు నన్ను ఐరెన్ లెగ్ అంటారు. అలాంటి స్టేట్మెంట్స్ నన్ను చాలా బాధపెట్టాయి. అయినా వాటిని తట్టుకుని ముందుకు వెళ్తేనే సక్సెస్ సాధించగలం' అని చెప్పింది.

Vidya Balan

చిత్ర పరిశ్రమ ఒక వ్యక్తిది కాదు..
ఇక సినీ ఇండస్ట్రీలో నెపోటిజం అనే చర్చను పూర్తిగా తప్పు పట్టింది. నెపోటిజం లేదని చెప్పింది. ఎందుకంటే చిత్ర పరిశ్రమ ఒక వ్యక్తిది, ఒక కుటుంబానిది కాదు. అలా అయితే అందరూ స్టార్ కిడ్సే సక్సెస్ కావాలి. నేను కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. అందుకే ప్రేక్షకులు నన్ను అభిమానిస్తారు. ఒంటరిగానే ఇంత దూరం ప్రయాణించా. ఇంకా చేయాల్సింది చాలా వుంది' అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Vidya Balan

Also Read: స్టేజ్‌పై బట్టలు మార్చుకోవడం నా వల్ల కాలేదు.. అయినా తప్పలేదు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు