గంభీర్ పచ్చి మోసగాడు.. రెచ్చిపోయిన మనోజ్ తివారీ

గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక కామెంట్స్ చేశాడు. గంభీర్ పచ్చి మోసగాడంటూ ఆరోపించారు. గంభీర్ చెప్పిన వాటినే పాటించడని విమర్శించారు. గంభీర్, రోహిత్ ల మధ్య సమన్వయం బాగాలేదని అభిప్రాయపడ్డాడు. దీంతో జట్టు వాతావరణం చెడిందన్నాడు.

New Update
gambhir

gambhir Photograph: (gambhir)

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక కామెంట్స్ చేశాడు. గంభీర్ పచ్చి మోసగాడంటూ తివారీ ఆరోపించారు. గంభీర్ చెప్పిన వాటినే పాటించడని విమర్శించారు. ఐపీఎల్లో కలిసి పనిచేసిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌లను ఏరికోరి తన టీమ్ లోకి తీసుకువచ్చాడని, వారేం చేశారని గంభీర్ ను తివారీ ప్రశ్నించారు. 

కోచ్ గంభీర్ , కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య సమన్వయం బాగాలేదని తివారీ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతోనే జట్టు వాతావరణం చెడిందన్నాడు. గంభీర్,  రోహిత్ కు అసలు పోలికే లేదన్నాడు తివారీ. ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ రోహిత్ అయితే గంభీర్ విజయం కేవలం ఐపీఎల్ టైటిల్ గెలవడానికి మాత్రమే పరిమితం అయ్యాడని వెల్లడించాడు. అందుకే ఇద్దరూ కలిసి పనిచేయలేకపోతున్నారని తివారీ అభిప్రాయపడ్డాడు. 

క్రెడిట్ మాత్రం గంభీర్ కే 

ఇక గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌ విజయాల కోసం తాను కల్లిస్, నరైన్ లాంటి ఆటగాళ్లు ఎంతో కష్టపడితే క్రెడిట్ మాత్రం గంభీర్ తీసుకున్నాడని మండిపడ్డారు.  గంభీర్ ఒక్కడే ఒంటరిగా కోల్‌కతా టీమ్ ను టైటిల్‌ వరకు నడిపించలేదని, దాని వెనుక టీమ్ వర్క్ ఉందని చెప్పుకొచ్చాడు. కాగా 2015లో ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అప్పటి బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీతో గౌతమ్ గంభీర్ గొడవపడ్డాడు. దీని తర్వాత గంభీర్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

 3-1తో సిరీస్‌ కోల్పోయిన భారత్ 

కాగా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. 3-1తో సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. ఇదేకాకుండా గంభీర్ కోచింగ్‌లో శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయిన టీమిండియా , ఆపై న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-3 తేడాతో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొంది.  

Also Read : భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు