శారీరక శ్రమ లేదని ..చాలామంది నిలబడి పనిచేస్తున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. రోజుకు రెండు గంటలకు పైగా నిలబడి పనిచేస్తే నరాల్లో రక్త ప్రసరణ తగ్గే ప్రమాదం ఉంది. రక్త ప్రసరణ మెరుగుపడకపోతే జబ్బులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేచోట కూర్చోకుండా, నిలబడకుండా మధ్య, మధ్యలో ఇంటర్వల్ తీసుకొని పనిచేస్తే ఏ సమస్య ఉండదు. ఒంటికాలి మీద బరువు పెడితే..రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఆఫీసుల్లో స్టాండింగ్ కల్చర్ పాటించే వాళ్లు ఎక్కువ సేపు నిలబడటం చేయొద్దని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read : ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు.. కొనసాగుతోన్న వాయుగుండం