LK Adwani: నిన్న రావొద్దన్నారు..నేడు రమ్మంటున్నారు..ఏం జరిగింది!

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సీనియర్‌ నేతలు అయినటువంటి ఎల్‌ కే అద్వానీ, జోషిలను ఆలయ ట్రస్ట్‌ రావొద్దని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీంతో నేడు విశ్వ హిందూ పరిషత్‌ వారు వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

New Update
LK Adwani: నిన్న రావొద్దన్నారు..నేడు రమ్మంటున్నారు..ఏం జరిగింది!

మరి కొద్ది రోజుల్లో అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే బీజేపీ కురవృద్దులైనటువంటి ఎల్‌కే అద్వానీ, జోషిలను మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమానికి రావొద్దని అయోధ్య రామ మందిర ట్రస్ట్‌ పేర్కొంది.

ఈ కార్యక్రమానికి వారిద్దరినీ రావొద్దు అనడానికి కూడా ట్రస్ట్‌ కారణాలను తెలిపింది. వారు వయసును దృష్టిలో పెట్టుకొని వారిని ఈ కార్యక్రమానికి రావొద్దని పేర్కొన్నట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. అసలు అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఉపిరి పోసిందే ఎల్‌ కే అద్వానీ, జోషి.

రామ మందిరం నిర్మించాలని కలలు కన్న అద్వానీ, జోషిలను మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావొద్దని తెలిపినందుకు ట్రస్ట్‌ సభ్యుల మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే వారిని అవమానించడానికే ఇలా చేశారని అంటున్నారు. ఈ అంశం తీవ్ర వివాదం కావడంతో విశ్వ హిందూ పరిషత్‌ స్పందించింది.

స్వయంగా అద్వానీ, జోషిల ఇళ్లకు వెళ్లి స్వయంగా రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికలు అందించింది. దీని గురించి విశ్వహిందూ పరిషత్ సభ్యుడు అలోక్‌ కుమార్‌ స్పందించారు. అయోధ్య రామ మందిరం ఆహ్వానాన్ని అద్వానీ, జోషిలకు ఇవ్వకపోవడం పెద్ద చర్చనీయాంశం మారింది.

కేవలం వారి వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే ఈ వేడుకకకు ఆహ్వానించలేదని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు.
అద్వానీ, జోషిలు కూడా దీనికి అంగీకరించినట్లు ఆయన వివరించారు.

పార్టీలో అత్యంత కురువృద్దులైన అద్వానీ, జోషిల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వారిద్దరినీ జనవరి 22న ఆలయానికి రావొద్దని తెలిపినట్లు వారు వివరించారు. ఎందుకంటే ప్రస్తుతం అద్వానీ వయసు 96 సంవత్సరాలు…జోషి వయసు 89 సంవత్సరాలు . ఇలాంటి సమయంలో వారు కార్యక్రమానికి వస్తే కనుక చాలా ఇబ్బందులు పడతారని వారిని కార్యక్రమానికి హాజరు కావొద్దని తెలిపినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వివరించారు.

ట్రస్ట్‌ చేసిన విన్నపాన్ని వారిద్దరూ కూడా అంగీకరించినట్లు చంపత్‌ రాయ్‌ వివరించారు. ఇదిలా ఉంటే 90 సంవత్సరాల దేవెగౌడను కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆయన వద్దకు ఆలయ కమిటీ సభ్యులు ముగ్గురు వెళ్లినట్లు సమాచారం. ఆయనను పిలిచి రామాలయం నిర్మాణానికి మూల స్తంభాలు అయినటువంటి వారిని ఆహ్వానించకపోవడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కేవలం వారిని అవమానించడానికే వారిని ఆహ్వానించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also read: సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి..ముంబై వెళ్లిపోయిన శ్రీలీల..ఎందుకంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు