Supreme Court: స్వలింగ సంపర్కుల వివాహాలపై నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు..

స్వలింగ వివాహాలకు చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మే 11న.. 10 రోజుల విచారణ తర్వాత తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ విచారణలో పిటీషనర్లు తమ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

Supreme Court: సేమ్ సెక్స్ వివాహాలపై..  సుప్రీం కోర్టు సంచలన తీర్పు
New Update

సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పు వెలువరించనుంది. స్వలింగ వివాహానికి చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కీలక ఆదేశాలివ్వనుంది. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మే 11న.. 10 రోజుల విచారణ తర్వాత తీర్పును రిజర్వు చేసింది. అయితే ఈ విచారణలో పిటీషనర్లు తమ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని అభ్యర్థించారు. మరోవైపు స్వలింగ సంపర్కులకు వివాహ హోదా ఇవ్వకుండా కొన్ని హక్కులు కల్పించడానికి పరిగణించవ్చచని కేంద్రం పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గతంలో సుప్రియో చక్రవర్తి - అభయ్ డాగ్, పార్థ్ ఫిరోజ్ - ఉదయ్ రాజ్ ఆనంద్ లాంటి పలువురు స్వలింగ సంపర్కుల జంట పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 20 పైగా పిటిషన్లు స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని పట్టుబట్టాయి. ప్రత్యేక వివాహ చట్టంలో మతాంతర, కులాంతర వివాహాలుకు రక్షణ ఉందని.. స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ పిటిషనర్లు ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. 2018లో పరస్పర అంగీకారంతో ఇద్దరు పెద్దల మధ్య స్వలింగ సంపర్కం నేరమని సుప్రీం కోర్టు ప్రకటన చేసింది. ఆ తర్వాత స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే IPC సెక్షన్ 377లోని భాగాన్ని కోర్టు రద్దు చేసింది. దీంతో గే వివాహాలకు కూడా చట్టబద్ధమైన హోదా కల్పించాలనే డిమాండ్స్ వచ్చాయి. చివరికి ఈ వ్యవహారం గత ఏడాది సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ఏడాది ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేసి తీర్పు రిజర్వు చేసింది. మరోవైరు కేంద్ర ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. భారతీయ సమాజం, దాని విశ్వాసాలు స్వలింగ సంపర్కుల వివాహాలను పరిగణించవని పేర్కొన్నారు. సమాజంలోని పెద్ద వర్గాల మాటలు కూడా కోర్టు వినాలని.. చట్టం చేయడం లేదా వాటిలో మార్పు చేయడం అనేది పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. స్వలింగ సంపర్కుల వివాహ సమస్య అనేది అంత సులభమేం కాదని అన్నారు. ప్రత్యేక వివాహ చట్టంలో కొన్ని మార్పులు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని.. వాళ్ల వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడం వల్ల అనేక న్యాయపరమైన చిక్కులు వస్తాయని పేర్కొన్నారు. ఇలా చేస్తే.. దాదాపు 160 వరకు ఇతర చట్టాలు ప్రభావితమవుతాయని అన్నారు. కుటుంబ, కుటుంబ సమస్యలకు సంబంధించిన ఈ చట్టాల్లో పురుషుడికి భర్తగా, స్త్రీకి భార్యగా స్థానం కల్పించారని తెలిపారు.

Also Read: 26 వారాల అబార్షన్ పిటిషన్‎పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

అయితే కేంద్రం వాదనలు విన్న న్యాయమూర్తులు ఈ అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని అంగీకరించారు. స్వలింగ జంటలు ఎదపర్కొంటున్న సమస్యలను పరిష్కరించగలరా అని న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని అడిగారు. అలాగే నపుంసక వర్గానికి ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ చట్టాన్ని రూపొందినట్లే స్వలింగ జంటల కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చా అని ప్రశ్నించారు. అయితే న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత అనేది కల్పించకుండా.. అలాంటి జంటలకు కొన్ని హక్కులు కల్పించే అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ అంశపై నేడు సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని స్వలింగ జంటల్లో ఆసక్తి నెలకొంది.

#gay-marriage #national-news #supreme-court
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe