Saindhav: సంక్రాంతి బరిలోకి విక్టరీ వెంకటేష్ 'సైంధ‌వ్‌'.. రిలీజ్ డేట్ ఫిక్స్

సంక్రాంతి విడుదలకు సిద్దమవుతున్న విక్టరీ వెంకటేష్ 'సైంధ‌వ్‌' మూవీ. విడుదల తేదిని ప్రకటించిన చిత్ర బృందం.

New Update
Saindhav: సంక్రాంతి బరిలోకి విక్టరీ వెంకటేష్ 'సైంధ‌వ్‌'.. రిలీజ్ డేట్ ఫిక్స్

Saindhav Release Date:  రీసెంట్ గా వచ్చిన రానా నాయుడు, F3, సినిమాల తర్వాత 75 వ చిత్రంగా తెరెకెక్కుతున్న ‘సైంధ‌వ్‌’ (Saindhav) సినిమాతో విక్టరీ వెంకటేష్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను హిట్ -2 దర్శకుడు శైలేష్ కొల‌ను(Sailesh Kolanu) మెడిక‌ల్ మాఫియా అనే బ్యాక్ డ్రాప్‌తో తెరెకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్ (Venkatesh) చేతిలో గన్ పట్టుకొని నిల్చున్న పోస్టర్ కు  ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన టీజర్ కూడా ఆసక్తికరంగా కనిపించింది.

హై బడ్జెట్ తో చిత్రీకరిస్తున్న 'సైంధ‌వ్‌' చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా(Pan India) స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. వెంకటేష్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు న‌వాజుద్దీన్ సిద్ధికీ (Nawazuddin Siddiqui) విలన్ పాత్రలో నటిస్తున్నారు.

చిత్రీకరణ మొదలు పెట్టిన కొద్దీ రోజులకే చిత్ర బృందం ఈ సినిమా డేట్ ను ఖరారు చేసింది. 2024 జనవరి 13 న థియేటర్స్ లో సందడి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వెంకటేష్ కూడా రిలీజ్ డేట్ వివరాలు తన సోషల్ మీడియా వేదిక పై షేర్ చేసారు.

అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో చాలా మంది స్టార్ హీరోలు, యంగ్ హీరోల సినిమాలు క్యూ లో ఉన్నాయి. గుంటూరు కారం, ఈగల్, హనుమాన్, నా సామీ రంగ, వీటితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న 'లాల్ సలామ్' సినిమా కూడా సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు. సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీ పడినప్పటికీ, కథ బాగా ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు అనే నమ్మకంతోనే మేకర్స్ 'సైంధ‌వ్‌' సినిమాను సంక్రాంతికి ప్లాన్ (Sankranthi Release) చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇప్పటికే చాలా సినిమాలు క్యూ లో ఉండగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేకర్స్ రిలీజ్ డేట్ ను ముందు లేదా వెనక్కి ఖరారు చేసే అవకాశం ఉంది.

Also Read: OTT Releases This Week: ఈ వారం ఓటీటీ ధమాకా.. అదిరిపోయే సినిమాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు