Venkatesh Prasad: అవును.. కోహ్లీ స్వార్థపరుడే : వెంకటేశ్ ప్రసాద్ విరాట్ కోహ్లీ రికార్డుల కోసమే ఆడతాడని, సెంచరీల కోసం స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటాడని విమర్శలు వినిపించాయి. దీనిపై భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ సీరియస్ గా స్పందించారు. అవును..కోహ్లీ స్వార్థపరుడే అంటూ విమర్శకులకు దీటుగా బదులిచ్చారు. By Jyoshna Sappogula 06 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Venkatesh Prasad: టీమిండియా డైనమిక్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు (49)ను సమం చేయడం తెలిసిందే. ఒకవైపు కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తుండగా మరోవైపు అతడిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కోహ్లీ కేవలం రికార్డుల కోసమే ఆడతాడని, సెంచరీల కోసం స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటాడని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. Also Read: ఇలా కూడా అవుట్ ఇస్తారా భయ్యా.. క్రికెట్ చరిత్రలో తొలిసారి..! దీనిపై భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 'అవును.. కోహ్లీ స్వార్థపరుడే' అంటూ తనదైన శైలిలో విమర్శకులకు దీటుగా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. కోహ్లీ స్వార్థపరుడని, వ్యక్తిగత మైలురాళ్ల కోసం పాకులాడుతుంటాడని కొన్ని తమాషా వాదనలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుందని పేర్కొన్నారు. Hearing funny arguments about Virat Kohli being Selfish and obsessed with personal milestone. Yes Kohli is selfish, selfish enough to follow the dream of a billion people, selfish enough to strive for excellence even after achieving so much, selfish enough to set new benchmarks,… pic.twitter.com/l5RZRf7dNx — Venkatesh Prasad (@venkateshprasad) November 6, 2023 "అవును.. కోహ్లీ స్వార్థపరుడే! కోట్లాది మంది అభిమానుల కలను సాకారం చేస్తున్నందుకు కోహ్లీ స్వార్థపరుడే! ఎంతో సాధించినప్పటికీ ఇంకా సాధించాలని ఆరాటపడుతున్నందుకు కోహ్లీ స్వార్థపరుడే! బ్యాటింగ్ లో సరికొత్త ప్రమాణాలు నిర్దేశించినందుకు కోహ్లీ స్వార్థపరుడే! జట్టు విజయాల కోసం తన వంతు సహకారం అందిస్తున్నందుకు కోహ్లీ స్వార్థపరుడే!" అంటూ వెంకీ ట్వీట్ చేశారు. #virat-kohli #venkatesh-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి