Venkatesh : మరో సినిమాను లైన్ లో పెట్టిన వెంకీ మామ.. ఈసారి 'రానా' డైరెక్టర్ తో..!

విక్టరీ వెంకటేష్ మరో డైరెక్టర్ కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారట. అతను మరెవరో కాదు నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల. ఈ డైరెక్టర్ వెంకటేష్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనిమీద బిజీగా ఉన్నారట.

New Update
Venkatesh : మరో సినిమాను లైన్ లో పెట్టిన వెంకీ మామ.. ఈసారి 'రానా' డైరెక్టర్ తో..!

Venkatesh Movie With Venu Udugula : గత ఏడాది 'సైంధవ్' మూవీతో పరాజయం అందుకున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక తాజాగా ఈ సీనియర్ హీరో మరో డైరెక్టర్ కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారట. అతను మరెవరో కాదు నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల.

Also Read : రాజ్‌తరుణ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఆత్మహత్యయత్నం చేసిన లావణ్య!

ఈ డైరెక్టర్ వెంకటేష్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనిమీద బిజీగా ఉన్నారట. మల్టీస్టారర్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో వెంకటేశ్‌తో పాటు మరో ఇద్దరు యువహీరోలు నటించనున్నట్టు సమాచారం. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనున్నట్టు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు