AP: టీడీపీ నాయకుడి దారుణ హత్య.. ఎస్ఐ, సీఐలపై వేటు..!

విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వెల్దుర్తి ఎస్ఐ, సీఐలపై వేటు పడినట్లు తెలుస్తోంది. నిన్న కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడు గిరినాథ్ చౌదరి దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో అలసత్వం చేసినందుకు ఉన్నతాధికారులు వీరిద్దరిని విఆర్ కు పంపారు.

New Update
AP: టీడీపీ నాయకుడి దారుణ హత్య.. ఎస్ఐ, సీఐలపై వేటు..!

Kurnool: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడు గిరినాథ్ చౌదరిను వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో అతి దారుణంగా నరికి హత్య చేశారు. సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐ సురేష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డిలకు ఆదేశించారు.

Also Read: ప్లీజ్.. మమ్మల్ని క్షమించండి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు.!

అయితే, విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వెల్దుర్తి ఎస్ఐ, సీఐలపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో సీఐ సురేష్ రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్‌ రెడ్డిలు అలసత్వం చూపించారని గుర్తించిన ఉన్నతాధికారులు వీరిద్దరిని విఆర్ కు పంపారు.

Advertisment
తాజా కథనాలు