Khammam Girls Hostel News: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో ఉన్న కస్తూర్బా విద్యాలయ వసతి గృహంలో గుర్తుతెలియని ఆగంతకులు చొరబడ్డారు. ముగ్గురు ఆగంతకులు చూసి విద్యార్థులు భయాదోళనకు గురి అయ్యారు. గత మూడు రోజుల క్రితం కూడా వసతి గృహంలోకి వచ్చినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థినులు వాపోయ్యారు. భయంతో వసతి గృహంలోనే విద్యార్థినుల అరుపులు చేశారు. అప్పడికే భయంతో పలువురు విద్యార్థినులు సొమ్మసిల్లి అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్థినులను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో జవహర్‌నగర్‌లో ఓ కస్తూర్బా వసతి గృహంలో అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విద్యార్థుల పెట్టెలు, దుస్తులు, బ్యాగులు కాలి బూడిదైనయ్యాయి. అయితే ఆ గదిలో విద్యార్థులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత నెల సెప్టెంబర్ 27న ఖమ్మం జిల్లా వైరాలో కస్తూర్బా వసతి గృహంలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన తెలిసింది. బాలికల వసతి గృహంలో నిద్రిస్తున్న పదిమంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వసతి గృహాలలో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం స్పందించడం లేదు. అక్కడున్న సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో..? ఇలాంటి ఘటనలు చూస్తే అర్థమవుతుంది.
అడిగితే వాళ్ళు వ్యక్తిగతంగా దాడులు
ఈ ఘటనపై డీఈవో సోమశేఖర్ శర్మ ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను అడిగి విషయం తెలుసుకున్నారు. పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. సెక్యూరిటీతో మాట్లాడి విషయం తెలుసుకున్నామన్నారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వడానికి కలెక్టర్‌తో మాట్లాడానని.. వాళ్లకి ఎలాంటి సెక్యూరిటీ కావాలన్నా పూర్తిగా కల్పిస్తామని కలెక్టర్ చెప్పారని డీఈవో వెల్లడించారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ముగ్గురు వ్యక్తులు హాస్టల్‌కి వచ్చి చంపుతామని బెదిరిస్తామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై తల్లిదండ్రులు స్పందిస్తూ.. సెక్యూరిటీని మార్చమని గతంలోని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే తెలుగు టీచర్ అడిగితే వాళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని వారు తెలిపారు. వసతి గృహ సిబ్బంది పర్యవేక్షణ లోపించిందని విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వసతిగృహ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్‌లోకి రాజేందర్…యాదవుల్లో కొత్త జోష్