/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-3-6.jpg)
Sunny Leone: మాజీ పోర్న్ స్టార్, నటి సన్నీలియోన్ డ్యాన్స్ ప్రొగ్రామ్ కు కేరళ యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తిరువనంతపురంలోని కార్యవటం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో జూలై 5న జరగబోయే ఈవెంట్‌కు అనుమతి ఇవ్వకూడదంటూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్.. రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమాల జాబితాలో సన్నీలియోన్ ప్రదర్శనను చేర్చకుండా చూసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
View this post on Instagram
అయితే గతంలో చోటుచేసుకున్న ప్రతికూల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీసీ తెలిపారు. క్యాంపస్ లోపల లేదా వెలుపల అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి యూనియన్‌ను అనుమతించబోమని ఆయన తెలిపారు. గతేడాది ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమానికి సన్నీలియోన్ పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా నలుగురు విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. మరో 64 మంది వరకు గాయపడ్డారు. దీనిపై అప్పట్లో కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తూ పూర్తిగా నిర్వహణ వైఫల్యమని, ఇకముందు అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Follow Us