New Update
Vastu Tips For Main Gate: ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ వస్తువులు ఉండకూడదు, ఇది దురదృష్టానికి కారణం అవుతుంది.వాస్తు శాస్త్రంలో ప్రతి దిశకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంటిలో ఉన్న వస్తువులకు ఎంతటి ప్రాధాన్యత ఉందో అదేవిధంగా ఇంటి మెయిన్ గేటులో ఉంచిన వస్తువులపై కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే ఇంటిముందు ఉన్న వస్తువులు సరైనవో కాదో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం, ఆదర్శవంతమైన ఇంటి ప్రధాన ద్వారం తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే ఉండాలి. మీ ఇంటి వాలు తూర్పు, ఉత్తరం లేదా తూర్పు-ఈశాన్యం వైపు ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, ఇంటి ముందు ఇళ్ళు, వస్తువులు, పిల్లర్లు మొదలైనవి ఉండటం మీ ఇంటిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
మీ ఇంటి ముందు ఇవి ఉండకుండా చూడండి
వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ముందు కార్లు, హ్యాండ్‌కార్ట్‌లు మొదలైనవాటిని ఉంచడానికి గారేజ్ లేదా గది ఉండకూడదు. ఇలా చేయడం వల్ల రాను రాను వారి ఆర్దిక పరిస్థితి క్షీణించడం మొదలవుతుంది. ఖర్చులుకుడా పెరుగుతాయి. .సుఖ సంతోషాలకు దూరం అవుతారు. ఆర్ధిక సమస్యలు , డబ్బు లేకపోవడం, ఆందోళన. మానసిక ఒత్తిడి మొదలైన వాటిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
చెత్త బకెట్
వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెత్తతో నిండిన బకెట్ ఎప్పుడూ ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మీ ప్రతిష్ట పడిపోవడమే కాకుండా మీ కుటుంబం అనేక వ్యాధుల బారిన పడి ఇబ్బంద్లులు పడాల్సిన పరిస్తితులు ఎదురవుతాయి.
మతపరమైన ప్రదేశం
వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ మతపరమైన స్థలం ఉండకూడదు. ఇలాంటి చోట్ల ఇళ్లు ఉన్నవారు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు.
పెద్ద రాయి లేదా రాతి స్తంభం
వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ముందు పెద్ద రాయి లేదా రాతి స్తంభం మొదలైనవి ఉండకూడదు, ఇలా ఉంటే అది వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. వీటికి ప్రిహారాలు చేయకపోతే గొడవలు ఎక్కువవుతాయి. మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా రాతితోకట్టిన ఇల్లు పాడైపోయి ఉన్నట్లయితే అది మీ ఇంటిపైనా, మీ మానసిక ఆరోగ్యంపైనా చెడు ప్రభావం చూపుతుంది.
ఇంటి ముందు నీటి ఎద్దడి
వాస్తు ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం ముందు బురద లేదా ఏదైనా రకమైన నీరు నిలిచి ఉంటే ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. వాస్తు నియమాల ప్రకారం, మురికి నీరు తరచుగా నిండిన ఇళ్లలో నివసించే ప్రజలు పదేపదే వ్యాధులను ఎదుర్కోవలసి ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్యం, క్యాలెండర్, మతపరమైన గ్రంథాల సమాచారంపై ఆధారపడి ఉంటుంది, RTV ఏ విధమైన నమ్మకాలను గాని , సమాచారాన్ని నిర్ధారించదు. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే. వీటిని అమలు చేయడానికి ముందు, దయచేసి మీరు పరిశోధన చేయండి. జ్యోతిష్యుడు లేదా వాస్తు పండితులను సంప్రదించండి.)
Advertisment