Vastu Tips : పగిలిన పాత్రలను ఇంట్లో ఉంచితే ఏమౌతుంది.. ఇంట్లో ఎనిమిది కోణాల అద్దాన్ని ఏ దిక్కున పెడితే మంచిది!

విరిగిన, పగిలిన పాత్రలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అలాంటి పాత్రల్లో ఆహారాన్ని తినడం, ఇతరులకు తినిపించడం వల్ల ఇంట్లో అనవసర సమస్యలు పెరుగుతాయి. దీంతో పాటు రుణం తీసుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పగిలిన పాత్రలను ఉపయోగించకూడదు.

Vastu Tips : పగిలిన పాత్రలను ఇంట్లో ఉంచితే ఏమౌతుంది.. ఇంట్లో ఎనిమిది కోణాల అద్దాన్ని ఏ దిక్కున పెడితే మంచిది!
New Update

Crack And Broken Items : ఇంట్లో ఏదైనా ఇష్టమైన వస్తువు కానీ, సెంటిమెంట్‌ తో కూడుకున్న వస్తువులు కానీ పాడైపోయినా, విరిగి, పగిలిపోయినా(Crack And Broken Utensils Items) కొందరు బయట పడేయకుండా ఇంట్లోనే ఉంచుకుంటారు. చాలా మంది వాటిని ఉపయోగిస్తుంటారు కూడా. అయితే వాస్తు శాస్త్ర(Vastu Shastra) ప్రకారం.. ఇది ఇంట్లో వాస్తు దోషాలను సృష్టిస్తుంది. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచడం అనేది ప్రతికూలతను తెస్తుంది.

దాని ప్రభావం ఇంట్లోని ప్రతి సభ్యుని పై ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతి వస్తువు పెట్టడానికి ఓ సరైన దిశ ఉంటుంది.
అది జీవితాన్ని(Life) ఎంతో ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా అద్దాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు కొన్ని ముఖ్య జాగ్రత్తలు పాటించాల్సిందే.

అద్దాన్ని పెట్టేటప్పుడు దిశను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. ఈ విషయాలు జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇంట్లో విరిగిన వస్తువులు లేదా పాత్రలు ఉంచడం వల్ల ఎలాంటి వాస్తు దోషాలు(Vastu Dosha) వస్తాయో తెలుసుకుందాం. అలాగే ఇంట్లో ఎనిమిది కోణాల అద్దాన్ని ఏ దిశలో ఉంచాలో కూడా తెలుసుకోండి?

విరిగిన పాత్రలను ఇంట్లో 

విరిగిన, పగిలిన పాత్రలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు. అలాంటి పాత్రల్లో ఆహారాన్ని తినడం, ఇతరులకు తినిపించడం వల్ల ఇంట్లో అనవసర సమస్యలు(Negative Energy) పెరుగుతాయి. దీంతో పాటు రుణం తీసుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పగిలిన పాత్రలను ఉపయోగించకూడదు. అంతే కాకుండా ఇంట్లో విరిగిన మంచాన్ని ఉపయోగించకూడదు.

అలాగే, రుణం ఇతర రకాల సమస్యలను నివారించడం కోసం, ఇంటికి ఉత్తరం వైపున ఒక అష్టభుజి, అంటే ఎనిమిది మూలలతో ఒక అద్దం అమర్చాలి. ఈ రకమైన అద్దాన్ని ఇంట్లో అమర్చుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి.

Also Read : డ్రై ఐస్‌ అంటే ఏమిటి? దానిని తిన్న వారు ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు?

#vastu-tips #lifestyle #vastu-shastra #broken-things
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe