Vastu Tips: కొత్త ఇల్లు కానీ అద్దెకు కానీ తీసుకుంటున్నారా..? అయితే 5 వాస్తు రూల్స్ మీకోసమే!

వాస్తు సరిగా ఉంటేనే, ఇల్లు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. లేదంటే కుటంబంలో సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.అయితే కొత్తగా ఇల్లు కట్టే సమయంలో కానీ అద్దెకు తీసుకునే ముందు పరిశీలించాల్సిన 5 వాస్తు టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

Vastu Tips: కొత్త ఇల్లు కానీ అద్దెకు కానీ తీసుకుంటున్నారా..? అయితే 5 వాస్తు రూల్స్ మీకోసమే!
New Update

ఇటీవల కాలంలో వాస్తుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని ఇండియన్ ఆర్కిటెక్చర్ ఫార్ములాగా భావిస్తారు. కొత్తగా ఇల్లు కట్టించేవారు వాస్తు సూత్రాల ప్రకారమే నిర్మించుకుంటున్నారు. కొత్త ఇల్లు కొనేవారు, అద్దెకు తీసుకునే వారు సైతం, దాని వాస్తు సరిగా ఉందా లేదా అనేది చూస్తున్నారు. వాస్తు సరిగా ఉంటేనే, ఇల్లు మొత్తానికి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. లేదంటే కుటంబంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు. అయితే కొత్తగా ఇల్లు కట్టే సమయంలో లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకునే ముందు అందరూ పరిశీలించాల్సిన 5 వాస్తు టిప్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

* మెట్లు

ఏదైనా బిల్డింగ్‌లో ఉండేవారు, దాని మెట్లు ఏ దిశలో ఉంటే మంచిదో తెలుసుకోవాలి. సాధారణంగా మెట్లు (Staircase) ఇంటి పశ్చిమం లేదా నైరుతి దిశగా ఉండాలి. కొత్త ఇంటిని కొనుగోలు చేసే ముందు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ దిశలు ఆర్థిక అస్థిర పరిస్థితులను నివారిస్తూ, నష్టాలు రాకుండా కాపాడుతూ, శక్తి ప్రవాహాన్ని ప్రోత్సహిస్తాయి.

* ఇంటి ఎంట్రన్స్

వాస్తు ప్రకారం.. ఇంటి ప్రవేశ ద్వారం దిశ చాలా ముఖ్యమైనది. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం వైపు ఉండాలి. దీంతో సూర్యోదయ సమయంలో వచ్చే కాంతి ఇంట్లోకి ప్రసరిస్తుంది. ఈ కిరణాలు పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. తద్వారా అదృష్టం కలుగుతుంది, ఆశావాద దృక్పథం పెరుగుతుంది. ఇంటికి వెంటిలేషన్ బాగుండాలి. తలుపులు, కిటికీల నుంచి సూర్య కిరణాలు ప్రసరించాలి. ఇందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.

* బెడ్ రూమ్

మాస్టర్ బెడ్‌రూమ్ ఇంట్లో నైరుతి వైపు ఉండాలి. ఈ గదికి స్థిరత్వం, శక్తిని తీసుకొస్తుందని చెబుతారు. అందుకే ఇంటి పెద్ద ఈ గదిలో ఉండాలి. పడకగది ఈశాన్యం వైపుగా ఉండకూడదు. ఎందుకంటే ఇది ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మాస్టర్ బెడ్‌రూమ్‌ను పెళ్లయిన వివాహిత జంటలు మాత్రమే ఉపయోగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అటాచ్డ్ బాత్రూమ్, బట్టలు మార్చుకునే గది లేదా బాత్ టబ్ మొదలైన వాటికి పడమర లేదా ఉత్తరం వైపు అనుకూలంగా ఉంటుంది.

* టాయిలెట్

మరుగుదొడ్లు ఇంటి వాయువ్య లేదా పడమర దిశల్లో ఉండాలి. ఈ ప్రాంతాలు పరిశుభ్రతను కాపాడేవిగా, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి ఇంటిని రక్షించేవిగా భావిస్తారు. బాత్ ఏరియా దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిశలో ఉండకూడదు. టాయిలెట్ సీటు ఉత్తరం వైపు ఉండాలి, అలా సాధ్యం కాకపోతే దక్షిణం పైపు ఉండవచ్చు.

* లివింగ్ రూమ్

ఇంట్లో లివింగ్ రూమ్ ఉత్తరం లేదా ఈశాన్య ముఖంగా ఉండాలి. కుటుంబ సభ్యులు కలిసి ఉండే ప్రాంతం, అతిథులకు ఆతిథ్యం ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది చాలా నీట్‌గా ఉండాలి. పదునైన వస్తువులు, పగిలిన వాటిని ఇక్కడ పెట్టకూడదు. వీటి కారణంగా మూడ్ దెబ్బతినవచ్చు.

#astrology #vastu #vastu-tips #horoscope
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe