Vasthu : వాస్తు ప్రకారం ఇంట్లోకి నల్ల చీమలు రావచ్చా..వస్తే ఫలితాలేంటి? ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా ?. అంతేకాకుండా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి? ఎటువంటి చీమలు కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో , స్థలాల్లో కనిపించాలి? . By Bhavana 26 Sep 2023 in ట్రెండింగ్ New Update షేర్ చేయండి శకున శాస్త్రం, సాముద్రిక శాస్త్రాలు అనేవి మన నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయాయి. చాలా మంది ప్రతి రోజూ కూడా బయటకు వెళ్లాలన్న ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇప్పటికీ శకునాలు చూసేవారు చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఉదయాన్నేలేవగానే ఎటువంటి శకునాలు ఎదురవుతాయో వాటిని బట్టే వారి రోజు ఎలా గడుస్తుందనేది కొందరు చెబుతుంటారు. ఇంట్లో ఉన్న పశువులు, పక్షులు కూడా శకునాల కిందకే వస్తాయి. ఇంట్లో జంతువులను పెంచుకుంటే ఎటువంటి ప్రభావం ఉంటుంది అనే విషయాలను శకున సాముద్రిక శాస్త్రాలు తెలియజేశాయి. అదేవిధంగా ఇంట్లో చీమలు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా ?. అంతేకాకుండా ఎటువంటి చీమలు ఇంట్లో కనిపించాలి? ఎటువంటి చీమలు కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో , స్థలాల్లో కనిపించాలి? . చీమలు ఏ దిక్కున కనిపిస్తే అదృష్టం వస్తుంది? వంటి అనేక విషయాలను శకున శాస్త్రం చెబుతుంది. చీమలు అనేవి మంచి, చెడు రెండింటిని సూచిస్తాయి. చీమలు ఇచ్చే కొన్ని సంకేతాల వల్ల ఇంట్లో మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనేది భవిష్యతులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని శకున శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా చీమల గురించి తెలుసుకోవాలంటే చీమలు రెండు రకాలుగా ఉంటాయని అవి ఎర్ర చీమలు, నల్ల చీమలు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మంచిదని, ఎర్ర చీమలు కనిపిస్తే శుభం కాదని శకున శాస్త్రం వివరిస్తుంది. సంస్థల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, ఇంట్లో కానీ చీమలు బయటకు వస్తున్నాయంటే మంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని సంకేతాలు ఇస్తున్నట్లు శాస్త్రం వివరిస్తుంది. ఇంట్లో నల్ల చీమలు కనిపించడం వల్ల కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా శాస్త్రం పేర్కొంటుంది. అయితే నల్ల చీమలు అధికంగా వస్తే మాత్రం అది మంచింది కాదు అని తెలిపింది. అదే విధంగా ఎర్ర చీమలు కనిపిస్తే మాత్రం కొంచెం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. కొన్ని పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా శకున శాస్త్రం హెచ్చరిస్తుంది. అందుకే ఇంట్లో ఎక్కువగా ఎర్ర చీమలు కనిపించకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో పడక గదిలో నల్ల చీమలు కనిపిస్తే కొన్ని బంగారు వస్తువులను కొనుగోలు చేయవచ్చని శకున శాస్త్రం వివరిస్తుంది. ఇంటి టెర్రస్ పైన నల్ల చీమలు త్వరలోనే కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. చీమలు ఇంటిలో ఉత్తరం వైపు నుంచి బయటకు వస్తే గొప్ప ఫలితాలు ఉంటాయి. పడమర వైపు నుంచి చీమలు బయటకు వస్తే ప్రయాణాలు చేయవలసి ఉంటుందని శకున శాస్త్రం తెలుపుతుంది. చీమలు దక్షిణ దిశ నుంచి కానీ బయటకు వస్తే డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయని, తూర్పు వైపు నుంచి బయటకు వస్తే అదృష్టాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా అంతర్జాలం నుంచి తీసుకుని వివరించబడినవి. #house #ants #sakuna-sastram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి