Pooja Vastrakar Shares Post Mocking PM Modi: భారత మహిళా క్రికెట్ జట్టులో అత్యంత ప్రామిసింగ్ ప్లేయర్‌లలో ఒకరైన పూజా వస్త్రాకర్ ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా , జేపీ నడ్డా, ఇతర బీజేపీ నేతలను ట్రోల్ చేస్తూ 'వసూలీ టైటాన్స్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఈ వివాదాస్పద పోస్ట్‌ను ఆమె తొలగించారు. అయితే ఈ పోస్ట్ పూజా పెట్టలేదని .. ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పోస్ట్ డిలీటైనా దానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి .
ఇంపాక్ట్ ప్లేయర్ 'ఈడీ':
కొందరు ఈ పోస్ట్‌ను కాంగ్రెస్‌కు మద్దతుగా భావిస్తున్నారు. మరికొందరు అలాంటి కంటెంట్‌ను పంచుకోవడం పూజా కెరీర్‌పై ప్రభావం చూపుతుందని క్రికెటర్‌ను హెచ్చరించారు. అయితే పూజా కేజ్రీవాల్‌కు మద్దతుగా ఈ పోస్ట్ పెట్టారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆ పోస్ట్ ఫొటోలో పైనా ఇంపాక్ట్ ప్లేయర్ 'ఈడీ' అని రాసి ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకోని బీజేపీ రాజకీయా ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రతిపక్షాలు నిత్యం విమర్శిస్తుంటాయి. ఇక ఇటీవలి ఎలోక్టరల్ బాండ్ల విషయంలోనూ బీజేపీపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఈడీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా.. బీజేపీ టాప్ లీడర్లను వసూలీ టైటాన్స్‌గా పేరు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొంతమంది వినియోగదారులు మాత్రం పూజా ఖాతా హ్యాక్‌కు గురైందని అంటున్నారు. అసలు ఆమె ఈ పోస్ట్ చేయలేదని చెబుతున్నారు. ఇక పూజా వస్త్రాకర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్, భారత్ తరపున ఆడుతున్న భారతీయ క్రికెటర్. ఆల్ రౌండర్, పూజ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. రైట్ హ్యాండ్ బ్యాటర్. 2018లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. భారత్ తరపున 4 టెస్టులు, 30 వన్డేలు, 58 టీ20Iలు ఆడారు వస్త్రాకర్. మధ్యప్రదేశ్ బిలాస్‌పూర్‌లో జన్మించారు పూజ. వస్త్రాకర్ WPLలో ముంబై ఇండియన్స్ మహిళల తరపున ఆడారు. గత(2023) సీజన్‌లోముంబై విమెన్స్ జట్టు టైటిల్ గెలుచుకుంది.
Also Read: OPS vs OPS vs OPS vs OPS vs OPS.. మొత్తం ఐదుగురు ‘పన్నీర్‌సెల్వం’లు ఒక చోట నుంచే పోటి!