MISSING : ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. వందల కిలోమీటర్లు ప్రయాణించిన వశిష్ట.. ఎక్కడ దొరికిందంటే!

కరీంనగర్ లో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక వశిష్ట కృష్ణను ఎట్టకేలకు పోలుసులు గుర్తించారు. ఐదు బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు శుక్రవారం రాత్రి 1:09 గంటలకు హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ లో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

MISSING : ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. వందల కిలోమీటర్లు ప్రయాణించిన వశిష్ట.. ఎక్కడ దొరికిందంటే!
New Update

Free Bus Effect :  కరీంనగర్(Karimnagar) లో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక వశిష్ట కృష్ణ(Vasista Krishna) ను ఎట్టకేలకు పోలుసులు గుర్తించారు. కరీంనగర్ బైపాస్ ఫ్లైఓవర్ ప్రాంతంలో బస్సు దిగి కనిపించకుండా పోయిన బాలికను కరీంనగర్ పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో గుర్తించి పట్టుకున్నారు.

ఈ మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా జూబ్లీ బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. శుక్రవారం రాత్రి రాత్రి 1:09 గంటలకు బాలికను చాకచక్యంగా పట్టుకొని కరీంనగర్ కు చేరుకున్నారు. బాలిక దొరికిన ఆనందంలో వశిష్ట కుటుంబ సభ్యులు పోలీసులకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఆపరేషన్ లో కరీంనగర్ రూరల్ ఎస్సై వెంకట్రాజం, అమ్మాయి బంధువులు, జూబ్లీ బస్టాండ్(Jubilee Bus Stand) పరిసర ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేయగా దొరికింది. అయితే బాలిక ఎలా తప్పిపోయిందో.. ఇక్కడకు ఎలా వచ్చిందనే వివరాలు తెలియాల్సివుంది. 37 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరుకు చెందిన కనుకుంట్ల నరసింహ రిటైర్డ్ ఆర్మి ఉద్యోగి. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి కరీంనగర్ లో నివాసం వుంటున్నారు. నరసింహ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు... పెద్దకూతురు వశిష్ట కృష్ణ (13 ) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే క్రిస్మస్ పండగ, బాక్సింగ్ డే సందర్భంగా స్కూల్ కి వరుస సెలవులు వుండటంతో వశిష్ట కృష్ణ అమ్మమ్మవాళ్ల ఇంటికి వెళ్లింది. సెలవులు ముగియడంతో నిన్న(బుధవారం) బాలికను తాతయ్య పెద్దపల్లిలో ఆర్టిసి బస్సు ఎక్కించాడు. కూతురు ఒంటరిగా వస్తుండటంతో ముందుగానే బస్టాప్ వద్దకు వచ్చి ఎదురుచూసాడు. బస్సు రాగానే దగ్గరకు వెళ్లి కూతురు కోసం చూసాడు. ఆమె కనిపించకపోవడంతో కంగారుపడిపోయిన అతడు కండక్టర్ తో పాటు ఇతర ప్రయాణికులను ఆరా తీసాడు. ఆమె కరీంనగర్ బైపాస్ లో దిగిపోయిందని వారు చెప్పారు.

ఇది కూడా చదవండి : AP: కోడికత్తి, బాబాయ్ మర్డర్ సినిమాలు కూడా తీయండి.. ఆర్జీవీకి లోకేష్ సలహా

దీంతో ఏదయినా అవసరం వుండి అక్కడి దింగిదేమోనని తండ్రి అక్కడికి వెళ్లాడు. కానీ బాలిక ఎక్కడా కనిపించలేదు. కూతురు వశిష్ట ఆచూకీ కోసం ఎంత వెతికినా లభించకపోవడంతో నరసింహ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుతో బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా బాలిక మిస్సింగ్ గురించి తెలియడంతో ఓ యువకుడు బాలిక కుటుంబసభ్యులకు కొంత సమాచారాన్ని ఇచ్చాడు. హైదరాబాద్ నుండి జగిత్యాలకు వెళుతున్న బస్సులో తనతోపాటు వశిష్ట కూడా వుందని... అయితే తాను మార్గమధ్యలో దిగిపోయానని తెలిపాడు. దీంతో బాలిక జగిత్యాలకు వెళ్లివుంటుందని భావించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. జగిత్యాల పోలీసుల సాయంతో బస్టాండ్, ఇతర ప్రాంతాల్లో వశిష్టం జాడకోసం గాలించారు కరీంనగర్ పోలీసులు.

#vashishta-krishna #free-bus-effect #hyderabad #karimnagar #missing
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe