Vasi Reddy padma: అవినాష్ హంతకుడని ఎలా అంటారు..షర్మిలపై వాసిరెడ్డి పద్మ మండిపాటు..!

వైఎస్ వివేకా హత్య కేసు కోర్టులో ఉండగా అవినాష్ హంతకుడని ఎలా అంటారని షర్మిలను ప్రశ్నించారు వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకోవడం దురదృష్టం అని వాపోయారు. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మండిపడ్డారు.

New Update
Vasi Reddy padma: అవినాష్ హంతకుడని ఎలా అంటారు..షర్మిలపై వాసిరెడ్డి పద్మ మండిపాటు..!

Vasi Reddy padma:  ఏపీసీసీ చీఫ్ షర్మిల రెడ్డిపై వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. షర్మిల కామెంట్స్ ఆశ్చర్యంగా ఉన్నాయన్నారు. కోర్టు పరిధిలో ఉన్న వైఎస్ వివేకా కేసులో తీర్పు ఆమె ఇస్తున్నారని.. శిక్ష కూడా వేసున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఫ్యామిలిలో ఉన్న చిచ్చు కడప ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ కుటుంబం నుండి వివేకా ను డేవియేట్ చేశారని వ్యాఖ్యనించారు.

దురదృష్టం

వివేకాను ఓడించడానికి ప్రయత్నాలు చేసిన వారు ఇప్పుడు షర్మిల పక్కన ఉన్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఉచ్చులో షర్మిల చిక్కుకోవటం దురదృష్టమని వాపోయారు. అవినాష్ రెడ్డి నిందితుడని ప్రచారం చేస్తూ ఎన్నికల అంశంగా మార్చటం మీ రాజకీయమా అని షర్మిలను ప్రశ్నించారు.

Also Read: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి

కాంగ్రెసే మోసం చేసింది

చంద్రబాబు ఇలా మాట్లాడితే ఉమ్మి వేస్తారు కనుక మీతో మాట్లాడిస్తున్నారా అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ హోదా గురించి మాట్లాడటం ఏంటని నిలదీశారు. తెలంగాణలో అసలు పార్టీ ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ ని ఆనాడు తిట్టారు.. హోదా ఇవ్వలేదని అన్నారు.. ఇపుడు కాంగ్రెస్ హోదా ఇస్తుందంటున్నారని అసలు ఇన్ని యూ టర్న్ లు ఎందుకు తీసుకుంటున్నారని షర్మిలను ప్రశ్నించారు.

తలవంపులు

రాజకీయాలులో చంద్రబాబుని ఊసరవెల్లిగా చూసామని.. ఇప్పుడు ఆయనకు మించిన ఊసరవెల్లిలా తయారు అయ్యారని దుయ్యబట్టారు.  జగన్ ని ఓడించాలనే షర్మిల, సునీత రాజకీయాలు చేస్తున్నారన్నారు. వైఎస్ బిడ్డగా రాజకీయం చేస్తున్న మిమ్మలని చూసి ప్రజలు బాధ పడుతున్నారన్నారు. మీ రాజకీయాల వల్ల వైఎస్ కు తలవంపులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు