AP News: తెలుగు మహిళ అధ్యక్షురాలిపై మాజీ కమిషన్ చైర్మన్ దాడి? డీజీపీకి ఫిర్యాదు!

మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తనపై దాడి చేశారంటూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ఆందోళన చేస్తున్న తనపై వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేశారని ఆరోపించారు.

New Update
AP News: తెలుగు మహిళ అధ్యక్షురాలిపై మాజీ కమిషన్ చైర్మన్ దాడి? డీజీపీకి ఫిర్యాదు!

Dasari Udayasree: మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గతంలో‌ తనపై దాడి చేసిందంటూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళ అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. విజయవాడ వాంబేకాలనీకి చెందిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న తనపై వాసిరెడ్డి పద్మ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. పాత ప్రభుత్వాసుపత్రి ప్రాగణంలో తమ అధినేత చంద్రబాబు బాలికను పరామర్శించి ధైర్యం చెప్పటానికి వస్తే బాధ్యతగల పదవిలో ఉన్న వాసిరెడ్డి పద్మ ఓవరాక్షన్ చేశారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోగా.. బాలిక కుటుంబానికి అండగా ఉన్న తమపై అక్రమకేసులు నమోదుకు పురికోల్పారని మండిపడ్డారు.\

ఇది కూడా చదవండి: Film Producers: సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. ఆ నటీనటులపై చర్యలకు సిద్ధం!

అలాగే వాసిరెడ్డి పద్మ ఆమెకు ఇచ్చిన పదవిని ఆడబిడ్డల శీలాలతో ఆటలాడుకుంది. వాంబేకాలనీ యువతి గ్యాంగ్ రేప్ కేసులో అప్పటి ప్రతిపక్షనేత నారా చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన నాపై వాసిరెడ్డి పద్మ దాడి చేశారు. మా అధినేత చంద్రబాబు ముందే వాసిరెడ్డి పద్మా బీసీ మహిళనైన నాపై దాడి చేసింది. డీజీపీని కలిసి వాసిరెడ్డి పద్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. మహిళా కమిషన్ పదవిని అడ్డం పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా చేసిన అక్రమాలపై మేము ఫిర్యాదు చేశాం. డీజీపీ సానూకులంగా స్పందించారు. విచారిస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

Advertisment
తాజా కథనాలు