/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-11T131838.407-jpg.webp)
Vasanthi Krishnan Engagement : బిగ్ బాస్ సీజన్ 6 రియాలిటీ గేమ్ షోలో పాల్గొన్న గ్లామర్ బ్యూటీ, బుల్లి తెర సెలెబ్రెటీ వాసంతి కృష్ణన్(Vasanthi Krishnan) త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. బిగ్ బాస్ షో (Bigg Boss 7) తో ఫెమస్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్ మా లో పలు టీవీ సీరియల్స్, డాన్స్ షోస్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడు పవన్ కళ్యాణ్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు. కొంత కాలం పరిచయంతో ప్రేమించుకున్న వీళ్లిద్దరు ఇరు కుటుంబ సభ్యుల నిర్ణయంతో త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్ 7 న తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన వీరి నిశ్చితార్ధ వేడుకలకు బిగ్ బాస్ సెలెబ్రెటీలు, పలువురు బుల్లి తెర యాక్టర్స్ హాజరయ్యారు. గీతు, శ్రీసత్య, సూర్య, ఇనాయ, అర్జున్ కళ్యాణ్ వాసంతి నిశ్చితార్థ వేడుకల్లో సందడి చేశారు. ప్రస్తుతం వాసంతి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
View this post on Instagram
Also Read: Samantha Ruth Prabhu: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత..!
వాసంతి పెళ్లి చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా నటుడే. పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'డార్క్ సిటీ' అనే చిత్రం నటిస్తున్నారు. వాసంతి తన నిశ్చితార్థం ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Bigg Boss 7 Telugu: టాప్ 5 లో ఉండలేకపోయా.. స్టేజ్ పై ఏడ్చేసిన శోభ..!