భారత్,శ్రీలంక 3వటీ20 మ్యాచ్ కు వరుణుడి అడ్డంకి!

శ్రీలంక, భారత్ మధ్య జరగనున్న 3వ టీ20 మ్యాచ్ కు వర్షపడే అవకాశమున్నట్టు శ్రీలంక వాతావరణ శాఖ తెలిపింది. నిన్న పల్లెకలె మైదానంలో భారీగా వర్షం కురిసింది.ఈరోజు మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురుస్తుందని శ్రీలంక వాతావరణ నివేదిక ప్రకటించింది.

New Update
భారత్,శ్రీలంక 3వటీ20 మ్యాచ్ కు వరుణుడి అడ్డంకి!

మూడు టీ20ల సిరీస్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు ముగియగా మూడో మ్యాచ్ ఈరోజు పల్లెకెలె వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురుస్తుందని శ్రీలంక వాతావరణ నివేదిక ప్రకటించింది.దీంతో ఈ మ్యాచ్ పూర్తి స్థాయిలో సాగుతుందా లేక మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

ఈ టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు పల్లెకెలె స్టేడియంలో జరిగేలా షెడ్యూల్‌ను సిద్ధం చేశారు. తొలి రెండు మ్యాచ్‌లు ఒకే మైదానంలో జరిగాయి. తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగినా, రెండో మ్యాచ్‌లో భారత్ ఛేదనకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో భారత్‌కు విజయ లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లలో 78 పరుగులుగా ఎంపైర్స్ నిర్దేశించారు.

ప్రస్తుతం మూడో టీ20 మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక విడుదల చేసింది. నిన్న శ్రీలంక పల్లెకలె మైదానంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఔట్ ఫీల్డ్ పూర్తిగా నీటితో మునిగి ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ జరిగే సమయానికి 10 శాతం వర్షం కురుస్తుందని శ్రీలంక వాతావరణ శాఖ వెల్లిడించింది. మూడో టీ20ని రద్దు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ భారత జట్టు 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు