Varun Tej- Lavanya: వరుణ్ బరాత్ లో నాగబాబు, నిహారిక డాన్స్ వీడియో వైరల్..!

మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, సన్నిహుతుల మధ్య ఈ జంట మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైంది. వరుణ్ బరాత్ లో నాగబాబు, నిహారిక డాన్స్ లు వేస్తూ సందడి చేశారు.

New Update
Varun Tej- Lavanya: వరుణ్ బరాత్ లో నాగబాబు, నిహారిక డాన్స్ వీడియో వైరల్..!

Varun Tej- Lavanya: వరుణ్, లావణ్య విహహా వేడుకలు అంగ రంగ వైభవంగా ఇటలీలోని (Italy) టుస్కానీలో ముగిశాయి. తెలుగు సాంప్రదాయ పద్ధతుల్లో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేశారు. వరుణ్ వివాహ వేడుకలను చాలా ఘనంగా ప్రారంభించారు. డోల్, బరాత్ తో వరుణ్ విలాసవంతమైన వింటేజ్ పోర్షే కారులో పెళ్లి వేదిక పైకి వచ్చారు.

ఇక వరుణ్ పెళ్లి వేదికకు వెళ్లే ముందు పెద్దనాన్న మెగాస్టార్ (Chiranjeevi) ఆశీర్వాదాలు తీసుకొని వెళ్లారు. వరుణ్ బరాత్ లో నాగబాబు (Nagababu), నిహారిక డాన్స్ వేస్తూ సందడి చేశారు. ప్రస్తుతం నాగ బాబు, నిహారిక డాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది.

వరుణ్, లావణ్య పెళ్ళిలో మెగా కజిన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వివాహ వేడుకలో వరుణ్, లావణ్య జంటతో మెగాస్టార్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నాగబాబుతో పాటు మెగా హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్(Allu Arjun), సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ దిగిన ఓ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సెలెబ్రెటీలు కూడా ఈ పెళ్ళికి హాజరయ్యారు. హీరో నితిన్, షాలిని దంపతులు ఈ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

Varun Tej- Lavanya

Varun Tej- Lavanya

Also Read: లావణ్య త్రిపాఠి కాస్ట్యూమ్ డిజైన్ వెనుక స్టోరీ తెలిస్తే షాక్..!

ప్రస్తుతం వరుణ్, లావణ్య పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. వరుణ్ తేజ్ 'మై లవ్' అనే క్యాప్షన్ తో ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో వరుణ్, లావణ్యల జంటను చూసిన మెగా ఫ్యాన్స్  అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Varun Tej

Image Credits: Varun Tej/ Instagram

Also Read: గ్రాండ్‌గా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌..మూడుముళ్ళ బంధంతో… ఒక్కటైన జంట..!!

Advertisment
తాజా కథనాలు