మెగా వెడ్డింగ్‌ కార్డ్ వచ్చేసింది..మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

తాజాగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ముందుగా ఈ వెడ్డింగ్‌ కార్డులో తాతయ్య, నానమ్మ అంజనా దేవి, కొణెదల వెంకట్రావు పేర్లు ముద్రించారు. కింద మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ పేర్లను కూడా కార్టులో ప్రింట్‌ చేశారు. నవంబర్‌ 1న ఈ జంట ఇటలీ వేదికగా ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్‌ హీరోలందరూ కూడా తమ సినిమాలకు బ్రేక్‌ చెప్పేశారు.

New Update
మెగా వెడ్డింగ్‌ కార్డ్ వచ్చేసింది..మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

కొణెదల వారి ఇంట మరో ఐదు రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది జూన్ లోనే మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి వేడుక ఎప్పుడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ జంట ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రెషన్స్ ని మొదలు పెట్టి, ఆ ఫోటోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంది. తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ముందుగా ఈ వెడ్డింగ్‌ కార్డులో తాతయ్య, నానమ్మ అంజనా దేవి, కొణెదల వెంకట్రావు పేర్లు ముద్రించారు.

publive-image

ఆ తరువాత కింద అమ్మమ్మ, తాతయ్య పేర్లను ముద్రించారు. కిందకి వస్తే వరుడు వరుణ్ తేజ్‌ పేరుతో పాటు తన తల్లిదండ్రులైన నాగబాబు, పద్మజ పేర్లును ప్రింట్‌ చేశారు. కింద పెళ్లి కుమార్తె లావణ్య త్రిపాఠి పేరు కింద తన తల్లిదండ్రులు అయిన కిరణ్‌, ధీరోజ్‌ త్రిపాఠి పేర్లను ముద్రించారు.

దాని కింద మెగాస్టార్ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌ పేర్లను కూడా కార్టులో ప్రింట్‌ చేశారు. నవంబర్‌ 1న ఈ జంట ఇటలీ వేదికగా ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్‌ హీరోలందరూ కూడా తమ సినిమాలకు బ్రేక్‌ చెప్పేశారు.

టుస్కానీ నగరంలో ఈ నెల 30 నుంచే ఈ పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నాడే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇటలీకి బయల్దేరి వెళ్తున్నారు. నవంబర్‌ 5న మాదాపూర్ లోని ఎన్‌ కన్వెన్షన్ హాల్‌ లో బంధువులు, స్నేహితులు కొందరు సినీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అయితే ప్రస్తుతం అందరిలో ఒక సందేహం ఉంది. ఈ పెళ్లి కోసం పవర్ స్టార్‌ పవన్ ఇటలీకి వెళ్తారా ? లేదా? అని. ఎందుకంటే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేడి నడుస్తుంది. పవన్ కూడా అటు ప్రచారంలో , ఇతర రాజకీయ వ్యవహారాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో దేశం దాటి వెళ్లి కొత్త జంటని ఆశీర్వదిస్తాడా..? అనేది చూడాలి.

Advertisment
తాజా కథనాలు