/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-100-1-jpg.webp)
Varun Tej - Lavanya Reception: మెగా కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. ఇటలీలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు పలువురు సెలెబ్రెటీస్ కూడా సందడి చేశారు. హీరో నితిన్, షాలిని దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. మెగా హీరోస్ చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు అర్జున్, శిరీష్ ఈ పెళ్లి వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇటలీలో వివాహ వేడుకలను పూర్తి చేసుకున్న మెగా కపుల్ తిరిగి శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఇటలీలో వీరి పెళ్ళి వేడుకలకు రాలేకపోయిన టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో రెసెప్షన్ (Reception) నిర్వహించారు. మెగా కపుల్ రెసెప్షన్ వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ సెలెబ్రెటీస్ హాజరయ్యారు.
ఈ వేడుకల్లో హీరో నాగచైతన్య, సునీల్, జయప్రద, ఆలీ, సైనా నెహ్వాల్ దంపతులు, హీరోయిన్ రితు వర్మ, మంచు విష్ణు, విరానిక దంపతులు, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి, రాజేంద్ర ప్రసాద్, బోయపాటి శ్రీను, సుకుమార్, సందీప్ కిషన్, తేజ సజ్జ పలువురు సెలెబ్రెటీస్ సందడి చేశారు. యాంకర్ సుమ తన కొడుకుతో కలిసి హాజరయ్యారు. వరుణ్, లావణ్య రెసెప్షన్ వేడుకల్లో చిరంజీవి, నాగబాబు స్పెషల్ లుక్ లో అందరిని ఆకట్టుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: Varun Tej- Lavanya: వరుణ్ బరాత్ లో నాగబాబు, నిహారిక డాన్స్ వీడియో వైరల్..!