Varun Dhawan : తండ్రి అయిన బాలీవుడ్ స్టార్ హీరో..!

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధవన్ తండ్రి అయ్యాడు. అతని భార్య నటాషా సోమవారం రాత్రి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ ధావన్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

New Update
Varun Dhawan : తండ్రి అయిన బాలీవుడ్ స్టార్ హీరో..!

Bollywood Actor Varun Dhawan Becomes Father : బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధవన్ తండ్రి అయ్యాడు. అతని భార్య నటాషా సోమవారం రాత్రి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ ధావన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. అంతేకాకుండా తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, తనకు మహాలక్ష్మి పుట్టిందని తెలిపాడు.

ఇక వరుణ్ ధావన్ తండ్రి అయ్యాడనే విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటూ పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వరుణ్ ధావన్ 2012 లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' అనే సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేశాడు. సిద్దార్థ్ మల్హోత్రా మరో హీరోగా నటించిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది.

Also Read : ఇక్కడ పెళ్ళయితే పక్కన పెట్టేస్తారు.. తెలుగు ఇండస్ట్రీపై కాజల్ షాకింగ్ కామెంట్స్!

ఆ తర్వాత బద్లాపూర్, హంటీ శర్మకి దుల్హని, బద్రీనాథ్ కి దుల్హని, వంటి సినిమాలతో స్టార్ డం అందుకున్నాడు. 2021 లో నటాషా దలాల్ ని పెళ్లి చేసుకోగా.. మూడేళ్ళ తర్వాత ఈ జంటకి ఆడపిల్ల పుట్టింది. ఇక వరుణ్ ధావన్ ప్రస్తుతం 'బేబి జాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. కాలిస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

Advertisment
తాజా కథనాలు