Varla Ramaiah: టీచర్ల బదిలీలో జరిగిన అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యా. ఒక్కో టీచర్ వద్ద రూ. 3 నుండి 6 లక్షలు కొట్టేశారని ఆరోపించారు. జగన్ స్కాంతో పోల్చితే ఇది పెద్దది కాదని అన్నారు. బొత్సా హయంలో జరిగింది భారీ దోపిడీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read: ప్లీజ్.. మమ్మల్ని క్షమించండి శ్రీధర్ రెడ్డి.. నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన వ్యాఖ్యలు.!
ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ఎవరైనా బదిలీలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. నేడు టీచర్స్ అంత లబోదిబో అంటున్నారని దుయ్యబట్టారు. బొత్సా ఇంటిపై దాడి చేసేందుకు టీచర్స్ రెడీగా ఉన్నారన్నారు. ఇది చాలా ప్రమాదమని..దీనిపై ఆలోచించి అందుకే ఏసీబీని ఆశ్రయించామని అన్నారు. అయితే డీజీ లేరని.. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
Also Read: జగన్ వీళ్ళను నమ్మి నట్టేట మునిగాడు.. మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్.!
టూరిజంలో కూడా ఇదే పరిస్థితి అన్నారు. మంత్రులు అవినీతి చేసిన వారిని వదిలేదు లేదని హెచ్చరించారు. మీ అవినీతి భాగోతం అంత బయటకు వస్తుందని.. మిమ్మలను అరెస్ట్ చేసేంత వరకు పని చేస్తామని పేర్కొన్నారు. చట్టం పరిధిలో అందరూ వ్యవహరించాలని.. బొత్సా అవినీతిని బయట పెడతామని ఉద్ఘాటించారు.