Modi in Varanasi : కాశీలో హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.!

లోక్‌సభ ఎన్నికలకు మూడోసారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత తొలిసారి కాశీకి చేరుకున్న ప్రధాని మోదీకి శనివారం రాత్రి ఘనస్వాగతం లభించింది. హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. 28 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో మోదీపై పూలవర్షం కురిపించారు ప్రజలు.

New Update
Modi in Varanasi : కాశీలో హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.!

Modi in Varanasi :  లోక్‌సభ ఎన్నికలకు మూడోసారి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత తొలిసారి కాశీకి చేరుకున్న ప్రధాని మోదీకి శనివారం రాత్రి ఘనస్వాగతం లభించింది.బబత్‌పూర్ నుండి విశ్వనాథ్ ధామ్ మీదుగా బనారస్ రైల్వే ఇంజిన్ ఫ్యాక్టరీ వరకు 28 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో కాశీ ప్రజలు తమ ఎంపీపై పూలవర్షం కురిపించారు. డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. పక్షం రోజుల వ్యవధిలో రెండోసారి తన పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన ప్రధానికి జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్ నినాదాల మధ్య 'మోదీ-మోదీ' అంటూ నినాదాలతో స్వాగతం పలికారు.

ప్రధాని మోదీ కాశీ ప్రజలకు ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలిపారు. విశ్వనాథ ధామానికి చేరుకుని, ఆచారాల ప్రకారం కాశీపురాధిపతిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాత్రి 7.30 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరుకున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పార్టీ నేతలు, అధికారులు మోదీకి స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలదేరిన మోదీపై పూల వర్షం కురిపించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ వరకు ప్రధానికి స్వాగతం పలుకుతూ కాశీ ప్రజలు ఉత్సాహం వెల్లివిరిసింది. చెప్పులు లేకుండా, చేతులు జోడించి ధ్యాన భంగిమలో వాహనం దిగారు ప్రధాని మోదీ. ప్రాంగణంలోకి ప్రవేశించి, శిఖర్ దర్శనం చేసుకున్న తర్వాత, గర్భగుడిలో కూర్చుని అభిషేకం చేశారు.మహాశివరాత్రి రెండో రోజు జాగరణలో భాగంగా పుష్పాలు, బిల్వపత్రాలను స్వామివారికి సమర్పించారు.

పుష్పకిరీటాన్ని ధరించారు.కాశీలోని జిఐ క్రాఫ్ట్ మెటల్ రిపోజిటరీ నుంచి నాలుగు అడుగుల పొడవున్న త్రిశూలాన్ని ముఖ్యమంత్రి ప్రధానికి బహూకరించారు. శివునికి సంబంధించిన చిహ్నాలైన పాము,దమ్రుతో అలంకరించి చెక్కిన త్రిశూలాన్ని ప్రధాని గౌరవంతో స్వీకరించారు. విజయ భంగిమలో ఊపుతూ తన భావోద్వేగాలను ప్రదర్శించారు.

ఇది కూడా చదవండి: ఎడారి దేశంలో దంచికొడుతున్న వానలు..నదులను తలపిస్తోన్న రోడ్లు..!

Advertisment
తాజా కథనాలు