Vanga Geetha: పవన్ కళ్యాణ్ తో పోటీలో ఉండేది ఇందుకే.. ఆర్టీవీతో వంగా గీత సంచలన వ్యాఖ్యలు..!

పవన్ కళ్యాణ్ పోటీ చేసినా సరే నియోజవర్గ ప్రజలు తనన్నే ఆదరిస్తారన్నారు కాకినాడ ఎంపీ పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత విశ్వనాధ్. ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ.. తాను పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచునని అందరూ తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Vanga Geetha: పవన్ కళ్యాణ్ తో పోటీలో ఉండేది ఇందుకే.. ఆర్టీవీతో వంగా గీత సంచలన వ్యాఖ్యలు..!
New Update

Vanga Geetha Sensational Comments On Pawan Kalyan: కాకినాడ ఎంపీ పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత విశ్వనాధ్ ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. తాను సుదీర్ఘకాలం నుండి రాజకీయాల్లో ఉన్నానన్నారు. నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని.. తాను పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచునని అందరూ తనను ఆదరిస్తారని ఆశ భావం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. ఎంపీగా ఉంటూ కేంద్ర నిధులు తెచ్చి పిఠాపురం డెవలప్ చేసినట్లు తెలిపారు.

ఎప్పుడూ అనుకోలేదు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుండి పోటీ చేసినా సరే నియోజవర్గ ప్రజలు తనన్నే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తో పోటీలో ఉంటానని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. తాను తన పార్టీ తరఫున పోటీలో ఉన్నానని.. ఆయన తన పార్టీ తరఫున బరిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇది కేవలం రాజకీయపరమైన పోటీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 2009లో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి తనకు అవకాశం ఇచ్చారని అప్పుడు పిఠాపురం వాసులు తనన్ను ఆశ్రయించారని వెల్లడించారు. తర్వాత కాకినాడ ఎంపీగా తన మార్కు తాను సంపాదించుకున్నానన్నారు.

Also Read: లోకేష్ కాన్వాయ్ తనిఖీలు.. లక్షా 80వేల మానిఫెస్టో కాపీలు.. కారణం ఇదేనా..!



పోటీలో ఉండేది ఇందుకే..

సంస్థాగతంగా రాజకీయ నిర్మాణపరంగా బూత్ స్థాయి లెవెల్ వరకు వైసీపీ అన్నింట ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం మహాసభలు నిర్వహించి కార్యకర్తలకు మంచి జోష్ ఇవ్వడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలోనూ, రాబోయే ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడంలోనూ  ముందంజలో ఉన్నామన్నారు. మహిళలకు అన్ని విధాల ప్రాధాన్యత ఇచ్చే పార్టీ వైసీపీ అని.. ఎన్నికల్లో 20 మందికి పైగా మహిళలకు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో ఎంపీలుగా నలుగురికి అవకాశం ఇచ్చి జగన్ మంచి మనసు చాటుకున్నారని కొనియాడారు. మహిళా శక్తి ఏంటో నిరూపించుకోవడానికి తామంతా పోటీలో ఉన్నామన్నారు.

ఓర్వలేకనే ఇలా చేస్తున్నారు..

తమ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తామని కామెంట్స్ చేశారు. హిందువుల దేవాలయాల అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా ఎవరూ చేయలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డిపై హిందువుల వ్యతిరేకి అని ప్రతిపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తారన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా వంగ గీత విశ్వనాథనే వాళ్ల ఆడపడుచుగా గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.

#pawan-kalyan #vanga-geetha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe