Vande Bharat:మార్చి నుంచి వందే భారత్ స్లీపర్..మొదటి రైలు అక్కడి నుంచే..

వందే భారత్ కొత్త రైళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఛైర్ కార్స్‌గా ఉన్న ఈ రైళ్ళు ఇక మీదట స్లీపర్ ట్రైన్స్‌గా రాబోతున్నాయి. మార్చి నుంచి వీటి ట్రయల్ రన్ మొదలవనుంది.

Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు
New Update

Vande Bharat Sleeper Trains:వందే భారత్...ఇండియాలో ఇవే అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్ళు. అయితే ఇప్పటివరకు వందే రైళ్ళు అన్నీ ఛైర్ కార్ రైళ్ళగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా...ఎన్ని గంటల ప్రయాణం అయినా కూర్చుని వెళ్ళాల్సిందే. ఇది చాలా ఫాస్ట్ ట్రైన్...ఫుడ్‌తో సహా అన్ని సౌకర్యాలు ఇస్తారు. కానీ ఎంతైనా అంతసేపు కూర్చుని ప్రయాణించడం కాస్త ఇబ్బందైన వ్యవహారమే. అయితే ఇక మీదట ఇది కూడా ఉండదు అని చెబుతోంది రైల్వే శాఖ. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్స్ ట్రయల్ రన్ మార్చి నెల నుంచి చేపడుతున్నామని చెప్పింది.

Also Read:Telangana:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై లుక్ అవుట్ నోటీసు

మొదటి రైలు అక్కడి నుంచే..

వందే భారత్ స్లీపర్ ట్రైన్ మొదటి రైలు ఢిల్లీముంబయ్ మధ్యన ప్రారంభించనున్నారు. రాజధాని కంటే వేగంగా ప్రయాణించే ఈ ట్రైన్‌లో 16 నుంచి 20 కోచ్‌లు ఉంటాయని చెబుతున్నారు. వీటి వల్ల భారత్‌లో ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రాత్రివేళ్ళల్లో నడపనున్నారు. వీటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేశారు. ఇప్పటివరకు ఉన్న అన్ని ట్రైన్స్ కంటే ఇవే అత్యంత వేగంగా ప్రయాణించేవి. ఈ రైళ్ళతో రెండు గంటల ప్రయాణం ఆదా అవనుంది.

ఇప్పటికే దాదాపు దేశంలో అన్ని చోట్లా వందే భారత్ ఛైర్ కార్ రైళ్ళు ప్రయాణిస్తున్నాయి. త్వరలో వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ కోసం దాదాపు 40వేల సాధారణ కోచ్‌లను ఆధునికంగా ఉండే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహా కోచ్‌లుగా మార్చనున్నారు.

#trains #vande-bharat #march #sleeper
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe