Vande Bharat : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు..!!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నాయి. నరసాపురం నుంచి బెంగళూరు మధ్య త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు నడిపే ప్రతిపాదన ఉన్నట్టు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడించారు.కాగా, ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు వందే భారత్ రైళ్లు (సిట్టింగ్) నడుస్తుండడం, వాటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడం చూస్తునే ఉన్నాం.

Vande Bharat : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు..!!
New Update

Vande Bharat Sleeper Train : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నాయి. నరసాపురం నుంచి బెంగళూరు మధ్య త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు నడిపే ప్రతిపాదన ఉన్నట్టు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్  వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ తొలి రైలును ఏపీలోని నరసాపురం నుంచి బెంగళూరుకు నడిపేందుకు అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. కాకపోతే వయా ఒంగోలు నుంచా లేక గుంటూరు నుంచి నడపాలా? అన్నది ఇంకా డిసైడ్ కాలేదని నరేంద్ర పాటిల్ తెలిపారు.

publive-image

వందేభారత్ స్లీపర్ కోచ్ లో ఎన్నో సదుపాయాలు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇటీవలే రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ (AshwiniVaishnaw)షేర్ చేయడం తెలిసిందే. ఒక రైలులో 857 బెర్తులు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్ లు కేటాయించనున్నారు. 10 గంటల్లో ఈ రైలు బెంగళూరు చేరుకుంటుందన్నారు. మరోవైపు సికింద్రాబాద్-పుణె మధ్య మరో స్లీపర్ వందేభార్ రైలు సర్వీసు నడిపే ప్రతిపాదన ఉందని వెల్లడించారు. వందేభారత్ తొలి స్లీపర్ రైలును తన నియోజకవర్గమైన నరసాపురం నుంచి ప్రారంభిస్తున్నందుకు లోక్ సభ ఎంపీ రఘురామకృష్ణం రాజు (Raghu Rama Krishna Raju) సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు గాను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్, రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.


కాగా, ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పలు వందే భారత్ రైళ్లు (సిట్టింగ్) నడుస్తుండడం, వాటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడం చూస్తునే ఉన్నాం. దీంతో స్లీపర్ వందే భారత్ రైళ్లను (Vande Bharat) ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సుముఖంగా ఉంది.

Also Read: డేంజర్ లో చంద్రబాబు హెల్త్.. స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర..లోకేష్, భువనేశ్వరి సంచలన ప్రకటనలు..!!

#andhra-paradesh #vande-bharat-train #vande-bharat-sleeper
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe