Vande Bharat Bullet Train: వందే భారత్ బుల్లెట్ రైలు.. కేంద్రం కొత్త ప్లాన్ మాములుగా లేదు!

వందే భారత్ సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ బుల్లెట్ రైలు మాత్రం గంటకు కనీసం 300 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. మరి వందే భారత్, బుల్లెట్ రైలులాగా ఎలా వెళ్తుంది? వివరాలు తెలుసుకుందాం.

Vande Bharat Bullet Train: వందే భారత్ బుల్లెట్ రైలు.. కేంద్రం కొత్త ప్లాన్ మాములుగా లేదు!
New Update

మనందరికీ ఇండియాలో బుల్లెట్ రైళ్లు రావాలని ఉంది. కానీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చాక.. టికెట్ రేట్లు 3 రెట్లు పెరిగాయి. ఇక బుల్లెట్ రైళ్లు వస్తే.. టికెట్ రేట్లు 6 రెట్లు పెరిగే పరిస్థితి ఉంటుంది. అయినా సరే.. అలాంటి రైళ్లను ఇండియా కూడా నడపాలని యువత కోరుకుంటున్నారు. అది అలా ఉంచితే.. కేంద్ర ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి.. వందే భారత్ బుల్లెట్ రైళ్లను తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఫ్రాన్స్‌లో TGV, జపాన్‌లో షింకాన్‌సెన్ హై-స్పీడ్ రైళ్లు ఇలాంటివే. కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి రైల్ నెట్‌వర్క్‌ని డెవలప్ చెయ్యాలి అనుకుంటోంది.

ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర మధ్య దేశ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు రెడీ అవుతోంది. అది దేశీయ రైలు కాదు. అందుకే ఇండియా స్వయంగా బుల్లెట్ రైలును తయారుచెయ్యాలి అనే టార్గెట్‌ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నట్లు తెలిసింది. ఆ ట్రైన్.. వందే భారత్ వ్యవస్థలోకి వచ్చేలా చేస్తుందని తెలిసింది. దీన్ని సాధ్యం చెయ్యడం ద్వారా ఇండియా కూడా 52 సెకండ్లలోనే రైలును జీరో స్పీడ్ నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా చెయ్యాలనుకుంటోంది.

ఇండియాలో వందే భారత్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయన్నది నిజం. ఐతే.. ఇవే నిరంతరం కొనసాగితే ఎలా… ఇంకా మార్పు రావాలి. విప్లవాత్మక మార్పు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఇండియాలో కూడా అన్ని చోట్లా బుల్లెట్ రైళ్లు రావాలనుకుంటున్నారు. అది వందే భారత్ ద్వారా సాధ్యమవుతుందని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో మేకిన్ ఇండియాలో భాగంగా హైస్పీడ్ రైళ్లను తయారుచెయ్యాలనే ప్లాన్‌లో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఇండియా కూడా సొంతంగా హైస్పీడ్ రైళ్లను తయారుచేసుకునే దేశంగా ఎదిగే అవకాశం ఉంటుంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు పూర్తైన తర్వాత.. 100 రోజుల్లో ఈ హైస్పీడ్ రైళ్లకు సంబంధించిన ప్లాన్ రెడీ అవుతుందని సమాచారం. వందే భారత్ బుల్లెట్ రైళ్లతోపాటూ.. ప్రయాణికులకు అనుకూలమైన చర్యలు కూడా తీసుకుంటారని సమాచారం. ఇందులో భాగంగానే 24 గంటల్లోనే టికెట్ రిఫండ్ స్కీమ్, రైల్వే సౌకర్యాలతో ఒక సూపర్ యాప్, మూడు ఎకనమిక్ కారిడార్లు, స్లీపర్ వందే భారత్ రైళ్లు.. వంటివి ఉంటాయని తెలుస్తోంది.

#indian-railways #vande-bharat-train
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe