చదువంటే ఇష్టమే.. ప్రయాణమంటే భయమంటున్న విద్యార్థులు

ఆ విద్యార్థులకు చదువంటే ఇష్టమాయే.. కానీ ప్రయాణమంటే చాలా భయం.. ఒక్క బస్సుతో ప్రమాదకరంగా విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. ఆ జిల్లాలో విద్యార్థులకు కష్టంగా మారింది బస్సు సౌకర్యం. చదువుకోవడం కోసం ప్రాణాలకు తెగించి మరీ ప్రయాణాలు చేస్తున్నారు.

New Update
చదువంటే ఇష్టమే.. ప్రయాణమంటే భయమంటున్న విద్యార్థులు

ఒక్క బస్సుతో నరకం

స్కూళ్లు, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు కష్టాలు ఎక్కువగానే ఉంటాయి. సమయానికి లేచి రెడీ అయి వెళ్తున్నా.. టైంకి బస్సు అనేది లేకపోవడంతో గంటల కొద్ది వెయిట్ చేసి వెళ్లాలంటే విద్యార్థులకు నరకంగా మారుతోంది. ఇంకా ఒక్కటే బస్సు ఉంటే మాత్రం అది విద్యార్థులకు మరో నరకం అనే చెప్పాలి. అలాంటి ప్రమాదకర బస్సు ప్రయాణం వనపర్తి జిల్లా విద్యార్థులను తీవ్ర ఇబ్బదులకు గురి చేస్తోంది. బస్సు చివరిలో వేలాడుతూ మరీ ప్రయాణాలు చేస్తూ వారి విద్యను కొనసాగించడానికి ఎంతో కష్టంగా ప్రయాణం చేస్తున్నారు.

ప్రమాదంతో ప్రయాణం

వనపర్తి జిల్లాలోని అమరచింత మున్సిపాలిటీ కేంద్రము గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే రూరల్ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఉంద్యాల, కొంకనోనిపల్లె, పాంరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన 120కి పైగా విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకోడానికి నారాయణపేట నుండి కర్నూలు వెళ్లే బస్సు కోసం ఉదయం ఎదురుచూస్తుంటారు. ఉదయం కాస్త ఆలస్యం అయినా మరో బస్సు ఉంటుందేమో కానీ ఒకే ఒక్క బస్సు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం పాఠశాల వదిలే సమయాన కర్నూలు నుండి నారాయణపేట వెళ్లడానికి ఒకే ఒక్క బస్సు వున్నందున ప్రమాదపు టంచున విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పక బస్సుకు వెలాడుతూ వెళ్తున్నామని ఆవేదనను వ్యక్తం చేశారు. స్కూల్ సమయానికి అనుగుణంగా అదనంగా మరొక బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

ప్లీజ్ హెల్ప్ చేయండి

బంగారు తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలు మాత్రం కనిపించవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఆర్టీసీ బస్సు నష్టాల్లో నడుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఒక్క బస్సు సౌకర్యంతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు కూడా సరిపడ బస్సు సౌకర్యాలు లేక కాలేజీ, స్కూల్‌కి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. విద్యార్థుల భవిష్యత్‌ కోసం చర్యలు తీసుకుని వారికి సరైన బస్సు సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల దూరాన్ని తగ్గిస్తూ ప్రజలను దగ్గరికి చేస్తున్న ఆర్టీసీ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు అంటునే ఉంటారు. ప్రతి పల్లెకు బస్సును నడిపిస్తున్నట్లు, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని సూచిస్తునే ఉన్నారు. కానీ ప్రతి పల్లెకు బస్సు నడపాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకున్నమని చెబుతారు..!. పెండ్లి, ఇతర ఫంక్షన్లకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని అంటారు!. బస్సుల్లో వాట్సాప్‌ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు?. ఇన్ని కార్యక్రమంలో చేపడుతున్న ఆర్టీసీ యాజమాన్యానికి విద్యార్థుల కష్టాలు కనిపిచటం లేదాని మండిపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు