Valentines day For Singles: ఫిబ్రవరిని ప్రేమ నెల అంటారు. ఒక వైపు వసంత రూపంలో ప్రకృతి ఆనందం.. మరోవైపు ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వాలెంటైన్ వీక్ (Valentine Week). ఇది ప్రేమపక్షులకు ఎంతో ఇష్టమైన నెల. అదే సమయంలో కొంతమంది చాలా బాధ పడే నెల కూడా ఇదే. పాత ప్రేమను గుర్తు చేసుకుంటూ కొంతమంది బ్యాడ్‌గా ఫీల్ అవుతుంటారు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. జరిగిపోయిన విషయాలను మార్చలేం. ఇంకొంతమంది సంబంధం లేని వ్యక్తుల గురించి ఆలోచిస్తుంటారు. నిజానికి మరొకరిని ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ముఖ్యం. మీరు ఒంటరిగా ఉండి, ట్రెండింగ్‌లో ఉన్న ఈ వాలెంటైన్స్ డే హ్యాష్ ట్యాగ్‌ని చూసిన తర్వాత నిరాశకు గురైనట్లయితే.. చింతించకండి. వాలెంటైన్ అంటే మీకు ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి అని అర్థం. ఆ అభిమానం ఉన్న వ్యక్తి వేరే ఎవరో అవ్వాల్సిన అవసరం లేదు. అది మీకు మీరే కావొచ్చు.
గిఫ్ట్:
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జంటలందరూ ఒకరికొకరు రకరకాల బహుమతులు (Valentine's Day Gifts) ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ సింగిల్స్ వారికి వారే ఓ గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. ప్రతి ఒక్కరి కోరికల జాబితాలో ఏదో ఒకటి ఇప్పటివరకు దక్కనది ఉంటుంది. చాలా కాలంగా కొనాలని ప్లాన్ చేసినా కొనలేకపోయిందుంటుంది. ఈ వాలెంటైన్స్ డే మీ సొంత కోరికల జాబితాపై దృష్టి పెట్టండి. ఆ కోరికను తీర్చుకునేందుకు ప్రయత్నించండి.
లంచ్-డిన్నర్:
ఒంటరిగా లంచ్ లేదా డిన్నర్‌కు వెళ్లండి. మీతో మీరే ఆనందంగా గడపండి. మీతో మీరే సమయాన్ని కేటాయించండి. ఆనందాల కోసం ఒకరిపై ఆధారపడడం మానుకోండి.
సింగిల్స్ కోసం డిన్నర్:
ఒకవేళ మీరు మరింత స్పెషల్‌గా మీకు లాగే సింగిల్‌గా ఉన్నవారి ఆనందం కోసం ఏమైనా చేయాలనుకుంటే డిన్నర్ ప్లాన్ చేయండి. సింగిల్స్ అందరిని పిలిచి డిన్నర్ ఇవ్వండి. అందరూ ఎంజాయ్ చేయండి. లవర్స్ డే అంటే ప్రేమికులే ఎంజాయ్ చేయాలని లేదు.. ఈ రోజులతో పని లేకుండా బతకవచ్చు.. రోజూ హ్యాపీగా ఉండవచ్చు. మీ స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించండి. ప్రేమ, సంభాషణ కూడా ఆనందాన్ని కలిగించేవే.. కొంతమంది కేవలం రొమాన్స్ మాత్రమే హ్యాపీనేస్ అనుకుంటారు. అందుకే మీ సింగిల్ స్నేహితులందరినీ డిన్నర్‌కు ఆహ్వానించండి. వీలైతే, మీరు బయట ఎక్కడైనా వారితో డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు. అందరూ కలిసి తమ స్వేచ్ఛను ఆస్వాదించవచ్చు.
రొమాన్స్ లేదని ఫీల్ అవుతున్నారా?
ఇది చాలా మంది బాధపడే విషయం. లవర్స్ డే అంటే ముద్దు ముచ్చట్లు అని భావించే సమాజం మనది. అటు లవర్స్ కూడా అందుకోసమే లవర్స్ డే అనుకుంటారు. ఇక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆనందాన్ని ఆస్వాదించడం కూడా చాలా ముఖ్యం. మీ సహచరులందరూ తమ భాగస్వాములతో ఆనందాన్ని అనుభవిస్తున్న చోట.. మీరు స్వీయ ఆనందాన్ని పొందవచ్చు. దీని కోసం అనేక రొమాన్స్ టాయ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో మీరు ఈజీ భావప్రాప్తిని చేరుకోవచ్చు.
Also Read: మంచినీళ్లు అతిగా తాగవద్దు.. ఎందుకో తెలుసుకోండి
WATCH: