Propose Day: 'ఐ లవ్‌ యూ' ఇలా చెప్పండి.. కచ్చితంగా ఓకే చెబుతారు.. ప్రపోజ్‌ టిప్స్!

ప్రేమను వ్యక్తపరచడానికి ఫిబ్రవరి 8న 'ప్రపోజ్ డే'గా జరుపుకుంటారు. తమ హృదయాల్లో దాగి ఉన్న భావాలను వ్యక్తం చేయలేని ప్రేమికులకు ఈ రోజు ప్రత్యేకమైనది. ప్రపోజ్‌ చేయడానికి కొన్ని సూచనలను మీకు అందిస్తున్నాం. ప్రపోజ్‌ టిప్స్ కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Propose Day: 'ఐ లవ్‌ యూ' ఇలా చెప్పండి.. కచ్చితంగా ఓకే చెబుతారు.. ప్రపోజ్‌ టిప్స్!
New Update

Valentine Week - Propose Day: ప్రపోజ్ డే వాలెంటైన్స్ వీక్‌(Valentine Week)లోని రెండో రోజు జరుపుకుంటారు. అంటే రేపే(ఫిబ్రవరి 8) ప్రపోజ్‌ డే(Propose Day). ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. నిజానికి ప్రపోజ్‌ ఎప్పుడైనా చేయవచ్చు. అయితే వాలెంటైన్స్‌ వీక్‌లో దాని కోసం ప్రత్యేక రోజు ఉండడంతో ప్రపోజ్‌డే సందర్భంగా ఐ లవ్‌ యూ చెప్పేవారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. మీ ప్రపోజల్‌కు అవతలి వ్యక్తి సానుకూలంగా స్పందించే అవకాశం ఇది. మీరు ఎవరినైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. ప్రపోజ్‌ డే నాడు ట్రై చేయండి. మీరు మీ లవర్‌కి ప్రపోజ్ ఎలా చేయాలో చెప్పే కొన్ని టిప్స్‌ను మీకు అందిస్తున్నాం.

ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్లండి:
రోజు ఒక చోటే ఉంటే బోర్ కొడుతుంది. ప్రపోజ్ చేసేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవడం ముఖ్యం. మురికికాలవ పక్కన ఐ లవ్‌ యూ అని చెబితే కంపుకొడుతుంది కదా. అందుకే ప్రపోజ్ చేయడానికి ఏదైనా రొమాంటిక్‌ లేదా పీస్‌ఫుల్‌ ప్లేస్‌కు ముందుగా మీ లవర్‌ను తీసుకోని వెళ్లాలి. మీ లవర్‌కు ఎలాంటి ప్లేసులు ఇష్టమో ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేయండి. సినిమాల్లో హీరో లేదా హీరోయిన్ ఇలా చేస్తారు. ప్రపోజ్‌ చేసే సమయంలో చుట్టూ రొమాంటిక్‌ వాతావరణం ఉంటే బెటర్‌. ఒకవేళ మీ లవర్‌ మీ ప్రపోజ్‌ను అంగీకరిస్తే అది మీ జీవితాంతం అందమైన జ్ఞాపకంగా మారుతుంది.

పువ్వులు ఇవ్వండి:
ఫ్లవర్స్‌ని లవర్స్‌కు ఇస్తే ఫ్లాట్‌ అవోచ్చు. వివిధ రంగుల పువ్వులు వివిధ భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. గులాబీలే కాకుండా, మీ భాగస్వామికి తులిప్స్, లిల్లీస్, డైసీలతో పాటు ఏ ఫ్లవర్‌నైనా ఇచ్చి ప్రపోజ్ చేయవచ్చు. పువ్వులను గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా మీ హార్ట్‌లోని భావాలను వ్యక్తపరచండి.

డిన్నర్:
నైట్‌ ఈజ్ బెస్ట్ ఫర్ రొమాన్స్. అందుకే మీరు ఇష్టపడిన వాళ్లని నైట్ డిన్నర్‌కు మంచి రెస్టారెంట్‌కు తీసుకెళ్లి ప్రపోజ్ చేసేలా ప్లాన్ చేయండి. మీ లవర్‌తో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. వారితో మంచి సమయాన్ని గడపవచ్చు. క్యాండిల్ లైట్ డిన్నర్ చాలా రొమాంటిక్‌గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గిఫ్ట్‌:
మీరు ఇష్టపడిన వాళ్లకి ఒక గిఫ్ట్‌ ఇచ్చి మీ ప్రేమను ప్రపోజ్ (Propose) చేయవచ్చు.

ముఖ్య గమనిక:
ప్రపోజ్ చేయడానికి డబ్బులు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ మనసులోని భావాలను చిన్న పువ్వు ఇచ్చి కూడా చెప్పవచ్చు.. అసలేమీ ఇవ్వకుండా కూడా చెప్పవచ్చు. మీరంటే ఇష్టం ఉంటే గిఫ్ట్‌లు ఇచ్చినా ఇవ్వకున్నా మీ లవర్‌ మీ ప్రేమను అంగీకరించవచ్చు.

Also Read: నేనే మొదట ప్రపోజ్‌ చేశా.. వరుణ్-లావణ్య ప్రేమ కథలు!

WATCH:

#valentine-week #valentines-day-2024 #propose-day-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe