Valentine's Day : ప్రేమికుల రోజు... ఈ రాశులకు అదృష్టమే..!

ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..ఈ వాలంటైన్ వీక్ ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీకిలోకి వెళ్లాల్సిందే.

New Update
Valentine's Day : ప్రేమికుల రోజు... ఈ రాశులకు అదృష్టమే..!

Valentine Week : వాలంటైన్స్ డే(Valentine's Day) వచ్చేస్తోంది. ఈ రోజు కోసం ఏడాది మొత్తం ఎదురుచూసేవారు కూడా ఉంటారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ప్రేమికుల వారంగా జరుపుకుంటారు. ఈ 7 రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమ(Love) ను రకరకాలుగా వ్యక్తపరుస్తుంటారు. జ్యోతిష్యశాస్త్రం(Astrology) ప్రకారం.. ఈ వాలంటైన్ వీక్(Valentine Week) ఈ రాశులవారికి బాగా కలిసివస్తుందట. మరి ఆ రాశులేంటో తెలుసుకుందాం.

1. మకరరాశి:
మకరరాశి వారికి ఈ వాలంటైన్స్ డే చాలా ప్రత్యేకం. మీ ప్రియమైన వారికి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇది సరైన సమయం. ప్రేమికులు తమ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రేమికుల రోజును అద్భుతమైన అవకాశంగా ఉపయోగించవచ్చు.

2.వృషభ రాశి:
ఈ ఏడాది ప్రేమికుల రోజున వృషభ రాశి వారి రొమాంటిక్ లైఫ్(Romantic Life) ని ప్రారంబిస్తారు. కొత్త జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవారి బంధాన్ని బలంగా ఉంచుతుంది.

3.వృశ్చిక రాశి:
ఈ రాశివారికి ఈ ఏడాది చాలా ప్రత్యేకం. ఈ రాశివారు ప్రేమలో కొత్త అనుభూతి చెందుతారు. సంబంధంలో ప్రేమ , ఆప్యాయతను పెంచుకుంటారు. వారు తమ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా తమ ప్రేమికుడిని కలుసుకుంటారు.

4. కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ ప్రేమికుల రోజున ప్రేమలో పడతారు. ప్రేమ సంబంధం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇది ముందుకు సాగే మార్గం మరింత సాఫీగా సాగుతుంది.

ఇది కూడా చదవండి : టీఎస్పీఎస్సీకి 40కోట్లు నిధులు..ఉద్యోగాల భర్తీకి కసరత్తులు షురూ..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు