Vaiko: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరిగినట్లైతే సమన్లు జారీ చేసి విచారణ జరపాలన్నారు. అంతే కానీ విచారణ జరపకుండా నేరుగా అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. 14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఇలా ఉగ్రవాదిలా అరెస్ట్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యకు నిదర్శనమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఆయనను అరెస్ట్ చేయడం పట్ల సీఎం జగన్ సంతోషించవచ్చు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చంద్రబాబు చేసిన సేవలను మాత్రం చెరిపివేయలేరని వ్యాఖ్యానించారు. త్వరలోనే చంద్రబాబు క్లీన్‌గా జైలు నుంచి బయటకు వస్తారని వైగో ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉంది..
మరోవైపు చంద్రబాబు అరెస్టును తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేయించారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం కూడా ఉందంటూ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం తెలియకుండానే ఓ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్‌లో కనీసం ఆయన పేరు కూడా లేకుండానే అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని.. బాబు కోసం ఐటీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేస్తున్నా అన్నారు. గతంలో టీడీపీ ఎంపీగా మల్లారెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీ కూడా నిర్వహించడం గమనార్హం.
భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి పరిపాలిస్తున్నారు..
ఇదిలా ఉంటే రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంసభ్యులు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మణిలతో కలిసి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల భవిష్యత్ గురించి ఆలోచించే వ్యక్తి ఇప్పుడు జైలులో ఉండగా.. భవిష్యత్తును నాశనం చేసే వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్‌లో స్కిల్ స్కామ్ లొల్లి.. తిట్టుకున్న వైసీపీ, టీడీపీ ఎంపీలు!
Vaiko: ఉగ్రవాదిలా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణం: వైగో
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా ఖండించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరిగినట్లైతే సమన్లు జారీ చేసి విచారణ జరపాలన్నారు. అంతే కానీ విచారణ జరపకుండా నేరుగా అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు.