V.C Sajjanar: ఇదేం వెర్రి ఆనందమో..ఆర్టీసీ ఎండీ మరో ట్విట్.!

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ఇదేం వెర్రి ఆనందమో అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియోలో ఓ యువకుడు ఆటోనూ వేలాడుతూ హల్ చల్ చేశాడు. అయితే, అటు వైపు సైకిల్ పైన వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టగా ఆ వ్యక్తి బోర్లపడ్డాడు.

New Update
V.C Sajjanar: ఇదేం వెర్రి ఆనందమో..ఆర్టీసీ ఎండీ మరో ట్విట్.!

V.C Sajjanar: సీనియర్ IPS ఆఫీసర్, తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక వీడియోను పోస్టు చేస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ అవగాహన కల్పిస్తూ ఉంటారు. తాజాగా, సజ్జనార్ ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

వీడియోకు ఇదేం వెర్రి ఆనందమో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఆ వీడియోలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తు వెళ్తోన్న ఆటోను ఓ  యువకుడు వేలాడుతూ హల్ చల్ చేశాడు. అయితే, అటు వైపు సైకిల్ పైన వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టగా ఆ వ్యక్తి బోర్లపడ్డాడు. ఆ వ్యక్తి కింద పడ్డా ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

ఇలా పలు వీడియోలనూ పోస్ట్ చేస్తూ అప్రమత్తం చేస్తుంటారు సజ్జనార్. గతంలో కూడా, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు బైక్ పై స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురి అయిన వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ రన్నింగ్‌లో ఉండగానే హ్యాండిల్ వదిలేసి బైక్‌పైనే వెనక్కి పడుకున్నాడు. కొంత దూరం వరకు అలాగే ముందుకు వెళ్లిన బైక్.. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లోకి దూసుకెళ్లింది. అతడు స్టంట్స్ చేసిన టైమ్ అర్ధరాత్రి కావటం, రోడ్డుపక్కన ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisment
తాజా కథనాలు