UCC: లివ్‌-ఇన్-రిలేషన్‌షిప్ జంటలకు ప్రభుత్వం షాక్‌.. అలా చేయకపోతే జైలు శిక్ష!

లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవించడానికి రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చెబుతోంది. యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌లో ఈ విషయాన్ని పొందుపరిచింది. ఒకవేళ రిజస్టర్‌ చేసుకోకుండా లివ్‌-ఇన్‌లో కొనసాగితే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది.

UCC: లివ్‌-ఇన్-రిలేషన్‌షిప్ జంటలకు ప్రభుత్వం షాక్‌.. అలా చేయకపోతే జైలు శిక్ష!
New Update

UCC Rules for Live In relationship couples: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత లివ్‌-ఇన్‌-రిలేషన్‌షిప్‌ జంటలకు కాస్త ఇబ్బందులు తప్పేలా లేవు. రాష్ట్రంలోని వెబ్ పోర్టల్‌లో లివ్‌-ఇన్ జంటలు పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఒకవేళ పేరు నమోదు చేసుకోకపోతే దంపతులకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు. దంపతులు రిజిస్ట్రేషన్‌గా స్వీకరించే రసీదు ఆధారంగా, వారు అద్దెకు ఇల్లు, హాస్టల్ లేదా పీజీని పొందగలుగుతారు. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన UCC ముసాయిదాలో ఈ నిబంధన ఉంది. UCCలో లివ్-ఇన్ గురించి స్పష్టంగా నిర్వచించారు. దీని ప్రకారం.. మేజర్లు లివ్-ఇన్ రిలేషన్షిప్‌లో జీవించవచ్చు. వారు అప్పటికే వివాహం చేసుకోని ఉండకూడదు.

రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి?

రిజిస్ట్రేషన్ తర్వాత రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని ఇస్తారు. ఆ రశీదు ఆధారంగా దంపతులు ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీ అద్దెకు తీసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న జంట తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు ఈ విషయాన్ని చెప్పాలి. లివ్‌-ఇన్ సమయంలో జన్మించిన పిల్లలు ఆ జంట చట్టబద్ధమైన పిల్లలుగా పరిగణించాల్సి ఉంటుంది. ఆ బిడ్డ అన్ని హక్కులను పొందుతారు. ఇక లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో నివసిస్తున్న ప్రతి వ్యక్తి విడిపోవడానికి కూడా నమోదు చేసుకోవాలి. ఇది కూడా తప్పనిసరి.

ఉత్తరాఖండ్‌ యూసీసీ:

యూనిఫాం సివిల్ కోడ్, లేదా UCC అనేది పౌరులందరికీ వర్తించే చట్టాల సమితిని సూచిస్తుంది. ఇతర వ్యక్తిగత విషయాలతోపాటు వివాహం, విడాకులు, వారసత్వం, దత్తతతో వ్యవహరించేటప్పుడు మతం ఆధారంగా రూల్స్ ఉండవు. ఉత్తరాఖండ్‌కు యూనిఫాం సివిల్ కోడ్ గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ చేసిన ప్రధాన ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని రాష్ట్రం నియమించిన ప్యానెల్ 2.33 లక్షల రాతపూర్వక అభిప్రాయం ఆధారంగా 749 పేజీల డ్రాఫ్ట్‌ను రూపొందించారు.

Also Read: పనికిరావన్న వారితోనే పల్లకీ మోయించుకున్న గాన లత

#live-in-relationship #uttarakhand
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe